Khalifa: ఇదెక్కడి చోద్యం.. తాత మనవళ్లుగా స్టార్స్
ABN, Publish Date - Dec 08 , 2025 | 05:49 PM
హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖలీఫా’.
మలయాళ సినీ పరిశ్రమలో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా (Prithviraj Sukumaran) నటిస్తున్న తాజా చిత్రం ‘ఖలీఫా’ (Khalifa). ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే నిత్యం వార్తల్లో నిలుస్తూ కేరళ నాట హాట్ టాపిక్ అవుతోంది. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) ఒక కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
కాగా.. మోహన్‌లాల్ ఈ సినిమాలో మంబరక్కల్ అహ్మద్ అలీ అనే పాత్రలో పృథ్వీరాజ్‌కు తాత పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. బంగారం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని నిర్మాతలు రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఓనం సందర్భంగా థియేటర్లకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. రెండో భాగం ప్రీక్వెల్ రూపంలో ఉండి, అందులో మోహన్‌లాల్ పాత్రను మరింత విస్తృతంగా చూపించనున్నారని సమాచారం.
తాజా అప్‌డేట్‌తో ‘ఖలీఫా’ చుట్టూ హైప్ మరింత పెరిగింది. తాత మనవడు మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకుని పృథ్వీరాజ్, మోహన్‌లాల్ పాత్రలను నడిపినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎమోషనల్ లేయర్‌కు యాక్షన్, ఇంటెన్స్ డ్రామా కూడా జత కానుండడంతో సినిమా అంతకుమించి అనే రేంజ్‌లో ఉండనుందని సినీ వర్గాలు, అభిమానులు ఇప్పటినుంచే అంచనా వేస్తున్నారు.
ఇక.. గతంలో పృథ్వీరాజ్ దర్వకత్వంలో మోహన్ లాల్ హీరోగా లూసిఫర్, ఎంపురాన్ చిత్రాలు చేయగా అవిఒకదాన్ని మించి మరోటి విజయం సాధించాయి. దీంతో వీరి కాంబినేషన్‌కు సౌత్ ఇంగియాలో మంచి క్రేజ్ ఉంది. ఇదిలాఉంటే.. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తుండగా జమ్వాల్ పాత్ర హైలెట్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.