Mohanlal: హంతకుడి బయోపిక్‌లో మోహన్ లాల్
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:44 PM
మాలీవుడ్ సూపర్ స్టార్ మరో ప్రయోగం చేయబోతున్నాడు. ఎవరూ ఊహించిన కథను సెలెక్ట్ చేసుకోవడమే కాదు.. ఆశ్చర్యపోయే పాత్రను ఓకే చేస్తున్నాడు. అంత పెద్ద హీరో.. ఆ రూల్ చేయడమేంటని అభిమానులే షాక్ అవుతున్నారు.
మళయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) వెర్సటాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రనైనా ఆయన నిస్సంకోచంగా చేస్తుంటారు. తన ఇమేజ్ ని డౌన్ చేస్తుందనే భయం అస్సలు ఆయనలో కనిపించదు. అలా ఇప్పుడు ఒక షాకింగ్ బయోపిక్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ఓ హంతకుడి బయోపిక్ కావడం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో 'దోసా కింగ్'గా ఫేమస్ అయిన శరవణా భవన్ ఫౌండర్ పి. రాజగోపాల్ ( Saravana Bhavan founder Rajagopal) జీవితంగా ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'వెట్టయాన్' (Vettaiyan), 'జై భీమ్' (Jai Bhim) లాంటి హిట్ మూవీలతో ఫేమస్ అయిన డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel ) డైరెక్షన్‌లో ఇది వస్తోంది. అది ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కాగా.. ఆయన మోహన్‌లాల్‌కు నరేట్ చేసారట. అది విని ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది
బయోపిక్ గా వస్తున్న రాజగోపాల్ జీవితం విషయానికి వస్తే... తమిళనాడులోని మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన.. పెద్దగా చదువుకోకపోయినా చిన్న హోటల్‌తో వ్యాపారం మొదలుపెట్టి, పెద్ద స్థాయికి చేరుకుంటాడు. తన పేరునే బ్రాండ్ గా మార్చుకుని.. గ్లోబల్ వైడ్ గా'దోసా కింగ్' (Dosa KIng ) గా ఫేమస్ అయ్యాడు. కానీ, జ్యోతిష్యుడి సలహాతో అసిస్టెంట్ మేనేజర్ కుమార్తెని పెళ్లి చేసుకోవాలని.. ఆమె భర్తను 2001లో చంపి అడవిలో పడేసాడు. హత్య నిరూపితమై 2010లో 10 ఏళ్ల జైలు, 2019లో సుప్రీంకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. అదే ఏడాది కోర్టుకు వెళ్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఈ స్టోరీని టీజే జ్ఞానవేల్ 'దోసా కింగ్' టైటిల్‌తో బయోపిక్‌గా తీస్తున్నాడు. ఈ పాత్రలో మోహన్‌లాల్ లీడ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి సినిమాలో రియల్ ఈవెంట్స్‌ను ఫాలో చేస్తారా లేక పాజిటివ్ టచ్ ఇస్తారా అనేది చూడాలి.
Read Also: Nitiin: శ్రీను వైట్లతో నితిన్ కొత్త సినిమా..
Read Also: Allu Aravind: చిరంజీవి వచ్చారంటే.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది.