Allu Aravind: చిరంజీవి వచ్చారంటే.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది..

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:19 PM

చిరంజీవి(Chiranjeevi), పవన్‌కల్యాణ్‌లతో (Pawan Kalyan) తన తల్లి కనకరత్నానికి ఉన్న అనుబంధాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ గుర్తుచేసుకున్నారు. వృద్థాప్య సమస్యలతో ఆగస్ట్‌ 30న అల్లు కనకరత్నమ్మ (KanakaRatnam)) మరణించిన విషయం తెలిసిందే.

చిరంజీవి(Chiranjeevi), పవన్‌కల్యాణ్‌లతో (Pawan Kalyan) తన తల్లి కనకరత్నానికి ఉన్న అనుబంధాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ గుర్తుచేసుకున్నారు. వృద్థాప్య సమస్యలతో ఆగస్ట్‌ 30న అల్లు కనకరత్నమ్మ (KanakaRatnam)) మరణించిన విషయం తెలిసిందే. ఆమె దశదిన కర్మను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అరవింద్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అమ్మది సంపూర్ణమైన జీవితం. తను మరణాన్ని, వీడ్కోలును విషాదకరంగా కాకుండా ఆమె జీవిత ప్రయాణాన్ని సంతృప్తిగా సాగనంపాలని ఒక సెలబ్రేషన్‌లా చేశాం. ఒక పవన్‌కల్యాణ్‌ సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించిన వారిలో అమ్మ కూడా ఒకరు. అతన్ని కల్యాణి అని ముద్దుగా పిలిచేది. ‘కల్యాణ్‌ చక్కగా ఉన్నాడు. తనతో ఒక సినిమా చేయాలి కదరా’ అని నాతో అనేవారు. చిరంజీవి అంటే మా అమ్మకి చాలా ఇష్టం. వారిద్దరూ ఎప్పుడు కలిసినా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకునే వారు. ఓసారి అమ్మకు సీరియస్‌గా ఉన్నప్పుడు చిరంజీవి వచ్చారు. అప్పుడు తను మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. చిరంజీవిగారు వచ్చారని చెప్పగానే కళ్లు తెరిచి చిరంజీవితో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. వారిద్దరి మఽధ్య మంచి అనుబంధం ఉంది. అటువంటి తల్లి కడుపున పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని అల్లు అరవింద్‌ చెప్పారు.

Updated Date - Sep 09 , 2025 | 06:19 PM