సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mohan Lal: పూజా కార్యక్రమాలతో.. 'దృశ్యం -3' స్టార్ట్

ABN, Publish Date - Sep 22 , 2025 | 05:12 PM

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోబోతున్న మోహన్ లాల్... దానికి ఒకరోజు ముందు దృశ్యం 3 సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. మీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జీతూ జోసఫ్ డైరెక్ట్ చేస్తున్నారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని మేకర్స్ తెలియచేశారు.

Mohan Lal Drishyam

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) సెప్టెంబర్ 23న న్యూ ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. 2022కు గానూ ఈ అవార్డ్ బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తిని వరించగా, 2023కు ఈ పురస్కారం కేరళకు చెందిన మోహన్ లాల్ స్వీకరించబోతున్నారు. అభిమానులు ప్రేమగా లాలెట్టన్ అని పిలుచుకునే మోహన్ లాల్ నటించిన 'వృషభ' సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన, స్వీకరణ మధ్యలో మోహన్ లాల్ తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన 'దృశ్యం' (Drishyam) మూవీ సరికొత్త ఫ్రాంచైజ్ ను ప్రారంభించారు. ఇప్పటికే విడుదలైన 'దృశ్యం', 'దృశ్యం -2' చిత్రాలు ఘన విజయం సాధించాయి. దాంతో ఆయన సెప్టెంబర్ 22, సోమవారం 'దృశ్యం -3' (Drishyam 3) ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం అయిన వెంటనే న్యూ ఢిల్లీకి దాదాసాహెబ్ పురస్కారం అందుకోవడానికి ప్రయాణమౌతున్నట్టు మోహన్ లాల్ తెలిపారు.


మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసఫ్‌ (Jeethu Joseph) దర్శకత్వంలో తొలిసారి 2013లో 'దృశ్యం' సినిమా విడుదలైంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా పలు భారతీయ భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగులోనూ వెంకటేశ్ (Venkatesh), మీనా (Meena) జంటగా నటించారు. అలానే 2021లో 'దృశ్యం -2' సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా చక్కని విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడీ సీరిస్ లో మూడో చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. కొచ్చిలోని ఎస్.ఎన్. లా కాలేజీ పూతొట్టలో ఈ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ, 'ఈ సీరిస్ లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. జార్జ్ కుట్టి పాత్రను మరోసారి పోషించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సస్పెన్స్ ప్రధానంగా సాగేది. కాబట్టి దానికి సంబంధించి ఏం మాట్లాడినా సబబుగా ఉండదు' అని అన్నారు. దర్శకుడు జీతూ జోసఫ్‌ మాట్లాడుతూ, 'దీనిని ఒక థ్రిల్లర్ గా కంటే ఫ్యామిలీ డ్రామాగా చూపించాలని అనుకుంటున్నాం. గడిచిన ఐదు సంవత్సరాలలో జార్జ్ కుట్టి కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని ఆసక్తికరంగా చూపబోతున్నాం' అని అన్నారు.

నిర్మాత ఆంటోని పెరుంబవూర్ మాట్లాడుతూ, 'సినిమా రంగానికి చెందిన అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే కు ఎంపికైన తర్వాత మోహన్ లాల్ గారితో ఈ సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉంది' అని చెప్పారు. మరి మోహన్ లాల్, జీతూ జోసఫ్‌ కాంబో లో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Also Read: Maa Vande: ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్

Also Read: OG Trailer: ముంబైకి వస్తున్నా.. తలలు జాగ్రత్త.. ట్రైలర్‌ ఊపేస్తుంది..

Updated Date - Sep 22 , 2025 | 06:39 PM