OG Trailer: ముంబైకి వస్తున్నా.. తలలు జాగ్రత్త.. ట్రైలర్ ఊపేస్తుంది..
ABN , Publish Date - Sep 22 , 2025 | 03:50 PM
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న‘ఓజీ’ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది.
పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న‘ఓజీ’ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కాన్సెర్ట్‌లో (OG trailer) ఆడిటోరియంలో ఉన్న అభిమానులకు మాత్రమే ట్రైలర్‌ను చూపించారు. ఆ అవుట్‌పుట్ బయటకు రాలేదు. సోమవారం మధ్యాహ్నం డీఐ పనులు పూర్తి చేసి ట్రైలర్‌ను వదిలారు. 2 నిమిషాల 40 సెకెన్ల నిడివి గల ట్రైలర్‌లో ఎలివేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
‘ముంబై’లో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్నీ సత్య దాదా వైపు తిరిగాయ్. దాదా వరకూ వెళ్లారంటే పరిస్థితి చెయ్యి దాటిపోతున్నట్లుంది’ అంటూ శుభలేఖ సుధాకర్ వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. ముంబై మాఫియా, ఇల్లీగల్ వెపన్స్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
‘అందరు గ్యాంగ్‌స్టర్స్ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే...’ అంటూ మాస్ ఎలివేషన్‌తో పవన్ ఎంట్రీ పిచ్చెక్కించేలా ఉంది.
మధ్యలో చిన్న ప్రేమకథ కూడా చూపించారు. పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని గ్యాంగ్‌స్టర్స్‌ను వేటాడే తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
‘నిన్ను కలవాలని కొందరు.. చూడాలని ఇంకొందరు.. చంపాలని అందరూ ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్ హైప్ ఇస్తోంది.
‘ముంబయికి వస్తున్నా... తలలు జాగ్రత్త’, ‘ఓజాస్ గంభీర నా కొడకల్లారా’ అంటూ పవన్ ఫుల్ ఫైర్‌తో చెప్పిన డైలాగ్ నెక్ట్స్ లెవల్లో ఉంది.
దీనిని బట్టి సినిమాలో హీరోయిజం ఏ రేంజ్‌లో ఉందబోతోందో తెలుస్తోంది. ఈ డైలాగ్‌లు అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి. ‘ఓజాస్ గంభీర’ అంటూ ఫైర్ స్ర్టోమ్ సాంగ్‌తో పవన్ పాత్రను ఎలివేట్ చేశారు దర్శకుడు. ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచేలా ఉంది. గ్యాంగ్ స్టర్‌గా పవన్ గ్రాండియర్ లుక్, పవర్ ఫుల్ వెపన్స్‌తో తన గ్యాంగ్‌తో చేసిన వార్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవన్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు సుజీత్ ఆయన్ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సీన్, సీన్‌కు టేకింగ్, దానికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోస్థాయికి తీసుకెళ్లింది.
విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ లుక్ కూడా చాలా స్టైలిష్‌గా ప్లాన్ చేశాడు దర్శకుడు. అయితే ‘ఓజీ’ టీజర్‌లో ‘అలాంటోడు మళ్లీ వస్తే.’ అనే డైలాగ్ ఎంతగానో పాపులర్ అయింది. అలాంటి డైలాగ్‌లో ట్రైలర్‌లో మిస్ అయింది. అయితే అంతకు మించి సినిమాలో ఉంటాయని అభిమానులు చెబుతున్నారు. పవన్ సరసన ప్రియాంక ఆరుళ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రధారులు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.