Rishab Shetty: ఏంటి.. మయకరగా నటించింది రిషబేనా.. ఏం మాయ చేశావయ్యా

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:21 PM

ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఉంటారు. సినిమా కోసం ప్రాణాలు కూడా పణంగా పెడతారు. అలాంటి వారిలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ఒకరు.

Rishab Shetty

Rishab Shetty: ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఉంటారు. సినిమా కోసం ప్రాణాలు కూడా పణంగా పెడతారు. అలాంటి వారిలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ఒకరు. కాంతార చాప్టర్ 1 (Kantara Chapter ) కోసం రిషబ్ ప్రాణం పెట్టాడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టార్ట్ అయ్యినప్పటి నుంచి.. రిలీజ్ అయ్యేవరకు కూడా ఎన్ని వివాదాలు, ఎన్ని అడ్డంకులు వచ్చాయో అందరికీ తెల్సిందే. అయినా కూడా అవేమి లెక్క చేయకుండా సినిమాను రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు రిషబ్.

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన కాంతార చాప్టర్ 1.. రూ. 400 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంకో వారంలో ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది. అయితే ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని ఒక సీక్రెట్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మయకర అనే పాత్ర ఉంటుంది. ఎప్పటికప్పుడు బెర్మికి ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్తూ ఉంటాడు ముసలి తాత. ఆయన కేవలం బెర్మికి మాత్రమే కనిపిస్తాడు.

మయకర పాత్ర సినిమాలో చాలా కీలకం. ఆ పాత్రలో ఎవరు నటించారు అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆ పాత్ర చేసింది కూడా రిషబ్ శెట్టినే కాబట్టి. ఏంటి నమ్మకం కుదరడం లేదా.. ఇదుగో ఈ వీడియో చూడండి. రిషబ్.. మయకర గా ఎలా మారాడో కనిపిస్తుంది. ఒకపక్క దర్శకత్వం చేస్తూ.. ఇంకోపక్క బెర్మి పాత్రలో నటిస్తూ కూడా మయకర కోసం సిద్దమయ్యాడు. ఈ పాత్ర లుక్ కోసం ఆరుగంటలు మేకప్ కోసం వెచ్చించాడు రిషబ్. పాత్ర కోసం, సినిమా కోసం రిషబ్ ఎంత కష్టపడ్డాడు అనేది ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు నీ డెడికేషన్ కు దండాలు.. ఏం మాయ చేశావయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Save Film Chamber: సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అంటూ కొవ్వొత్తుల ర్యాలీ..

Mass Jathara Trailer: ఇక్కడ సంజీవిని లేదు.. ఆంజనేయుడు రాడు.. ట్రైలర్ అదిరిపోయిందంతే

Updated Date - Oct 27 , 2025 | 09:15 PM