Ravi Teja: బాహుబలి: ది ఎపిక్ విడుదల రోజునే మాస్ జాతర...
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:01 PM
రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్' విడుదల రోజునే రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న 'మాస్ జాతర' విడుదల కాబోతోంది. అదే రోజున రెండు అనువాద చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
రవితేజ (Raviteja) కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అందుకున్న చిత్రాలలో ఒకటి 'విక్రమార్కుడు' (Vikramarkudu). అందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ, అల్లరి చిల్లరిగా తిరిగే యువకుడిగానూ రవితేజ డ్యుయల్ రోల్ ప్లే చేశాడు. అలానే రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara) లోనూ రవితేజ సబ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ భేరి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాడు.
దసరా సందర్భంగా 'మాస్ జాతర' సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు. ఈ సినిమా ద్వారా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. చాలా సార్లు 'మాస్ జాతర' సినిమా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు మేకర్స్ లేటెస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ను సరదా వీడియో రూపంలో తెలిపారు.
ఇదిలా ఉంటే... రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎపిక్ మూవీస్ 'బాహుబలి, బాహుబలి -2'ను కలిసి ఇప్పుడు ఒక్కటి చేసి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31నే వస్తోంది. అంటే 'బాహుబలి : ది ఎపిక్'తో రవితేజ 'మాస్ జాతర' పోటీ పడబోతోందన్న మాట. చిత్రం ఏమంటే... అక్టోబర్ 31వ తేదీనే రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) హిందీ అనువాద చిత్రం 'థామా', విష్ణు విశాల్ (Vishnu Vishal) తమిళ డబ్బింగ్ సినిమా 'ఆర్యన్' సైతం జనం ముందుకు రాబోతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ యే చిత్రాలకు విజయం దక్కుతుందో చూడాలి.
Also Read: JR NTR: ‘కాంతార చాప్టర్ 1’ ఎన్టీఆర్ రియాక్షన్..
Also Read: Akkineni: అన్నపూర్ణ పిక్చర్స్ మొదటి సినిమా 'దొంగరాముడు'