సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mamitha Baiju: ఇక ఆ ఆశ వదులుకున్నా.. ఇప్పుడు మాత్రం ఇదే.. 

ABN, Publish Date - Aug 02 , 2025 | 11:06 AM

డాక్టర్‌ కావాలని యాక్టర్‌ అయ్యానని కోలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న మలయాళ హీరోయిన్‌ మమిత బైజు (Mamitha Baiju) చెప్పుకొచ్చారు.

Mamitha Baiju

డాక్టర్‌ కావాలని యాక్టర్‌ అయ్యానని కోలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్న మలయాళ హీరోయిన్‌ మమిత బైజు (Mamitha Baiju) చెప్పుకొచ్చారు. అగ్రహీరో విజయ్‌తో ‘జననాయగన్‌’, ప్రదీప్‌ రం గనాథన్‌తో ‘డ్యూడ్‌’, విష్ణు విశాల్‌తో ‘ఇరండు వానమ్‌’, సూర్యతో ఒక చిత్రం లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను డాక్టర్‌ కావాలని భావించాను. కానీ, చిత్ర పరిశ్రమలోకి అనుకోకుండా అడుగుపెట్టాను. అప్పటికీ డాక్టర్‌ కావాలన్న ఆశ ఉండేది. కానీ, ఆ సమయంలో ఏడు చిత్రాల్లో నటించేందుకు సంతకం చేశాను. దీంతో నా ఆశ వదులుకున్నాను. అయితే, నాన్న మాత్రం ఎంతో బాధపడ్డారు. డాక్టర్‌ను చేయాలని ఎంతగానో ఆశపడి సపోర్టు చేశారు. చివరకు నటిగా స్థిరపడేందుకు సమ్మతించారు’ అని పేర్కొన్నారు. 

2017 నుంచి ఆమె మలయాళ సినిమాల్లో ఉన్నా.. సక్సెస్‌ఫుల్‌ సినిమాల్లో నటించిన  విపరీతంగా పాపులారిటీ తెచ్చిన చిత్రం ప్రేమలు. ఈ సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది. తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు అందుకునే దిశగా పయనిస్తోంది. అయితే మాతృభాషతో పాటు తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉండీ మలబారు బ్యూటీ. ప్రస్తుతం ఆమె సూర్య 46, ధనుష్‌ 54 చిత్రాలతోపాటు విజయ్‌ జననాయగన్‌ చిత్రంలోనూ నటిస్తోంది. టాలీవుడ్‌ మేకర్స్‌ కూడా ఆమెతో చర్చలు జరుపుతున్నారు. 

ALSO READ:
Shah Rukh Khan: నేషనల్‌ అవార్డును అందుకు ఉపయోగించుకుంటా..

Rani Mukerji: తొలి జాతీయ అవార్డ్‌

Anil Ravipudi: బాధ్యత పెంచింది

Dhanush 54: ‘డి-54’..  నిజంగానే  ఎంతో ప్రత్యేకం 


Updated Date - Aug 02 , 2025 | 11:06 AM