Dhanush 54: ‘డి-54’.. నిజంగానే ఎంతో ప్రత్యేకం
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:28 AM
స్టార్ హీరో ధనుష్ 54వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానరుపై డాక్టర్ ఐసరి కె.గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘
స్టార్ హీరో ధనుష్ 54వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానరుపై డాక్టర్ ఐసరి కె.గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘పోర్ తొళిల్’ ఫేం విఘ్నేష్ రాజా దర్శకుడు. ఇందులో ధనుష్ సరసన పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌లో ధనుష్ నటిస్తున్న దృశ్యాన్ని నిర్మాణ సంస్థ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఒక పాత పీసీవో బూత్ నుంచి ధనుష్ ఫోన్ చేస్తున్నట్టుగా ఈ స్టిల్ ఉంది. ధనుష్ కి అనేక హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత స్వరాలు సమకూర్చుతున్నారు.
ALSO READ: Sir madam Review: విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ నటించిన ‘సార్ మేడమ్’.అలరించిందా..
నిర్మాత గణేష్ వివరిస్తూ ‘ధనుష్, విఘ్నేష్ రాజా, జీవీ ప్రకాష్ కుమార్ వంటి అసాధారణ ప్రతిభ కలిగిన వారితో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మా బ్యానరుపై నిర్మించే చిత్రాలు ప్రేక్షకులకు అర్థవంతమైన, వినోదాత్మకంగా అందించేందుకు ప్రయత్నిస్తాం. నిజంగానే ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. త్వరలోనే అభిమానులతో మరిన్ని విషయాలు పంచుకుంటాం’ అని పేర్కొన్నారు.
ALSO READ: Shah Rukh Khan: నేషనల్ అవార్డును అందుకు ఉపయోగించుకుంటా..
Rani Mukerji: తొలి జాతీయ అవార్డ్
Anil Ravipudi: బాధ్యత పెంచింది