Madharasi: గజినీ పోలికతో.. 'మదరాసి'
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:11 PM
ఫ్లాపు డైరెక్టర్ ఆశలన్నీ ఆ మూవీ పైనే పెట్టుకున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న హీరోతో జతకట్టి... రిలీజ్ కు ముందే ఆ మూవీపై బజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా కల్ట్ మూవీతో పోలుస్తూ అంచనాలు పెంచుతున్నాడు.
మురుగదాస్ (Murugadoss) కోలీవుడ్ లో తోపు డైరెక్టర్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. అలాంటి బ్రాండ్ ఉన్న డైరెక్టర్ ఏమైందో ఏమో తెలియదు కానీ వరుసగా తడబడుతున్నాడు. ఆడియెన్స్ పల్స్ ను పట్టుకోలేకపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను ఖాతాలో వేసుకుంటున్నాడు. 'స్పైడర్, సర్కార్ , దర్బార్' తో పాటు రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో 'సికిందర్' (Sikandar) చేసిన అదృష్టం మాత్రం వరించలేదు. దీంతో ఈ సారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి ఫిక్స్ అయ్యాడు. అందుకే వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న శివకార్తికేయన్ (Sivakarthikeyan ) తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఇచ్చిన హైప్ చర్చనీయాంశంగా మారింది.
'మదరాసి' ఓ యాక్షన్ చిత్రమన్నారు మురుగుదాస్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం అభిమానులకు సరికొత్త అనుభూతినిస్తుందన్నారు. అంతేకాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'గజనీ' (Ghajini) తరహాలో 'మదరాసి' ఉంటుందని... యాక్షన్ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయని బజ్ ను క్రియేట్ చేశాడు. 'గజినీ' లాంటి కల్ట్ మూవీతో 'మదరాసి'ని పొల్చడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth ) , శివకార్తికేయన్ మధ్య సాగే లవ్ ట్రాక్ అందరికి కనెక్ట్ అవుతుందని సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే వరుస చార్ట్‌బస్టర్ సౌండ్ ట్రాక్‌లతో దూకుడు మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) 'మదరాసి'కి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న తరుణంలో వరుస ప్రమోషన్స్ తో మేకర్స్ సందడి చేస్తున్నారు. ఆడియెన్స్ ను తమ వైపు తిప్పుకునేలా పక్కాప్లానింగ్ తో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు 'మదరాసి'కి 'మిరాయ్', 'ఘాటీ 'మూవీలు గట్టి పోటీ గా నిలవనున్నాయి. మరీ ఈ రేస్ లో గెలిచి మురుగదాస్ మళ్లీ ఫామ్ లో వస్తాడో లేదో అన్న చర్చ అప్పుడే మొదలైంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Also: Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ ప్లాపులే కారణమా
Read Also: NTR: ఏంటీ.. ఎన్టీఆర్ సీరియల్ లో కూడా నటించాడా.. అది కూడా ఆ పాత్రలో