Aneesh: 'లవ్ ఓటీపీ' చెబుతానంటున్న అనీష్
ABN, Publish Date - Oct 22 , 2025 | 05:40 PM
కన్నడ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న 'లవ్ ఓటీపీ' మూవీ నవంబర్ 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా హీరో అనీష్... దీనిని డైరెక్ట్ చేశాడు.
అనీష్ హీరోగా నటిస్తూ తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన చిత్రం 'లవ్ ఓటీపీ'. జాన్విక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ నవంబర్ 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో బుధవారం సినిమా ట్రైలర్ ను, సాంగ్ ను మీడియా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, 'ఇందులో నేను హీరో తండ్రిగా నటించాను. కొడుకును కూతురిలా చూసుకునే డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్ అది. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. జాన్విక కు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. అనీష్ ఈ మూవీతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ఆనంద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు' అని చెప్పారు. కథానాయకుడు, దర్శకుడు అనీష్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు సరైన ఛాన్స్ దక్కలేదు. కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. దాంతో కన్నడ రంగంలోకి వెళ్ళిపోయాను. చాలా కాలంగా మళ్ళీ తెలుగులోకి రావడానికి ప్రయత్నిస్తున్నాను. కంటెంట్ నమ్మి ఈ మూవీని చేశాం. అందుకే పది రోజుల ముందే మీడియాకు ఈ మూవీని చూపించాలని అనుకున్నాం. నిర్మాత విజయ్ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రాజీవ్ కనకాల గారు ఈ మూవీని భుజానికెత్తుకుని ముందుకు తీసుకు వెళ్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది' అని అన్నారు.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ, ‘అనీష్‌తో నాకు పదహారేళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేశారు. ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీని షూట్ చేశాం’ అని అన్నారు. హీరోయిన్ జాన్విక మాట్లాడుతూ, ‘తెలుగులో ఇది నా మొదటి చిత్రం. షూటింగ్ అంతా సరదాగా చేశాం. రాజీవ్ కనకాల గారితో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్ గారికి, హీరో, దర్శకుడు అనీష్ గారికి థాంక్స్’ అని అన్నారు. బాబా భాస్కర్ మాట్లాడుతూ .. 'లవ్ ఓటీపీలో పనిచేసే అవకావం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు, ఇందులో లవ్, మాస్ సాంగ్స్ ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో నటుడు నాట్య రంగ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్, లిరిక్ రైటర్ దినేశ్, కెమెరామ్యాన్ హర్ష, సంగీత దర్శకుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Seven Hills Satish: మెగాఫోన్ పట్టబోతున్న యంగ్ ప్రొడ్యూసర్
Also Read: R Chandru: యో.. సినిమా చూసావా.. ఓజీ ఎక్కడ.. కబ్జా ఎక్కడ