Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్.. దిమ్మతిరిగే స్ట్రాటజీ
ABN, Publish Date - Nov 12 , 2025 | 03:05 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన స్ట్రాటజీతో దిమ్మతిరిగేలా చేస్తున్నాడు. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఎవరూ ఊహించని ప్రయోగాలు చేస్తూ ఇప్పటికే అందరి మనసుల్నీ కొల్లగొట్టాడు. అంతలోనే మరో సాహసోపేతమైన అడుగు వేయడానికి రెడీ అయ్యాడు. దీంతో అతని కొత్త ప్రయాణానికి సంబంధించిన వార్తలు హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్... సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్. ముఖ్యంగా మాస్ పల్స్ తెలిసిన వారిలో ఆయన్ను ముందు వరుసలో పెట్టేయ్యొచ్చు. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఆడియెన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రతి సినిమాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తూ తన సినిమాలోని ప్రతి హీరోతోనూ సాలిడ్ యాక్షన్ స్టంట్స్ చేయిస్తూ ఇండస్ట్రీలో బిగ్ డిబేట్ గా మారాడు. పైగా సినిమాల్లో యూనిక్ స్టైల్ తో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన ఆయన ప్రెజెంట్ 'కూలీ'తో మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. 'కూలీ' కోసం దర్శకుడిగా ఏకంగా 50 కోట్ల పారితోషికం తీసుకున్న లోకేష్... ఇప్పుడు నటుడిగా మారుతున్నాడు.
టాప్ స్టార్ హీరోస్ తో సినిమాలు తీసిన లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. ఎవరితో చేస్తాడని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఖైదీ 2 సీక్వెల్ తో పాటు అజిత్ తో మూవీ ఉంటుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఉహించని వార్త ను రివీల్ చేశాడు. హీరోగా కొత్త అవతారమెత్తబోతున్నట్లు తెలిపాడు. 'కూలీ'తో డైరెక్టర్ గా కాస్త నిరాశపరిచిన లోకేశ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే హీరోగా తన డెబ్యూ మూవీ కోసం ఏకంగా 30 కోట్లు రూపాయాలను పారితోషికంగా లోకేశ్ తీసుకోబోతున్నాడన్న వార్త ఇంకా ఎక్కువ షాక్ ఇచ్చింది. డెబ్యూ చిత్రానికి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా లోకశ్ చరిత్ర సృష్టించేలా కనిపిస్తున్నాడు.
అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికార ప్రకటన రానుంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి డీసీ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. గతంలో సిల్వర్ స్క్రీన్ పై అతిథిపాత్రల్లో మెరిసిన లోకేష్ తో ఇప్పుడు బడా బ్యానర్ నిర్మాణానికి రెడీ అవ్వడంతో ఇందులో మాస్ హీరోగా అతను కనిపించబోతున్నాడట. దాదాపు రూ. 100 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు దర్శకుడిగా సత్తా చాటిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తాడేమోనని సినీ జనం అనుకుంటున్నారు. మరీ వారి అంచనాలను లోకేష్ ఏమేరకు అందుకుంటాడో చూడాలి.
Read Also: Konda Surekha: నన్ను క్షమించండి.. నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ
Read Also: Anu Emmanuel: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లో నా నటనకు.. అబ్బాయిలు క్లాప్స్ కొడుతున్నారు