Konda Surekha: నన్ను క్షమించండి.. నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:07 AM
మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జునపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన కుటుంబాన్ని నొప్పించే ఉద్దేశం లేదని, వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.
గతంలో నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని స్పష్టం చేశారు. నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే దానికి చింతిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు సురేఖ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టం చేసూ ఓ పోస్టు పెట్టారు.
అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబాన్ని బాధపెట్టడం లేదా అపఖ్యాతి కలిగించడం నా ఉద్దేశం కాదు” అని పేర్కొన్నారు. అలాగే ఆమె ట్వీట్‌లో, “నా వ్యాఖ్యల వల్ల ఎవరికి అయినా తప్పుడు అభిప్రాయం కలిగితే దానికి నేను చింతిస్తున్నాను. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను” అని స్పష్టం చేశారు. మంత్రి సురేఖ ఇచ్చిన వివరణతో ఇక ఈ వివాదానికి తెరపడుతుందేమో చూడాలి.