Kotha Lokah: హమ్మయ్య.. ఎట్టకేలకు లోక ఓటీటీకి వచ్చేస్తుంది
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:53 PM
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయినా సినిమాల్లో కొత్త లోక (Kotha Lokah) ఒకటి .
Kotha Lokah: ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అయినా సినిమాల్లో కొత్త లోక (Kotha Lokah) ఒకటి . మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో నటించాడు. మొట్ట మొదటి లేడీ సూపర్ హీరో సినిమాగా కొత్త లోక తెరకెక్కింది.
ఎన్నో అంచనాల నడుమ కొత్త లోక ఆగస్టు 28 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా రికార్డ్ కలక్షన్స్ ను రాబట్టింది. చంద్రగా కళ్యాణి నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇక సినిమాలో క్యామియోలుగా నటించిదుల్కర్, టోవినో థామస్ షాక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూసారు.
కొన్నిరోజుల క్రితం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ, వాటిని దుల్కర్ ఖండించాడు. అధికారిక ప్రకటన వచ్చేవరకు వీటిని నమ్మకండి అని చెప్పుకొచ్చాడు. ఇక ఎట్టకేలకు మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. జియో హాట్ స్టార్ కొత్త లోక డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చింది. స్ట్రీమింగ్ డేట్ ఇంకా చెప్పలేదు కానీ, త్వరలోనే చంద్ర ఓటీటీలోకి అడుగుపెడుతుందని తెలిపింది. అయితే అక్టోబర్ 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
Siddu Jonnalagadda: ఉమనైజర్ కాంట్రవర్సీ.. ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అన్న సిద్దు
Vijaya Bhaskar: నాకు, త్రివిక్రమ్‌కు.. బాలయ్యతో సినిమా సెట్ అయి మిస్సయింది!