Ajith: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో
ABN, Publish Date - Jun 24 , 2025 | 05:03 PM
సాధారణంగా స్టార్ హీరోలు.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ మారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు జుట్టు పెంచుకుంటూ వస్తారు. ఇంకొన్ని సార్లు బాడీని పెంచుతారు.
Ajith: సాధారణంగా స్టార్ హీరోలు.. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ మారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు జుట్టు పెంచుకుంటూ వస్తారు. ఇంకొన్ని సార్లు బాడీని పెంచుతారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మరికొంతమంది హీరోలు లుక్ తోనే ట్రెండ్ క్రియేట్ చేస్తారు. బయట ఎలా అయితే ఉన్నారో.. అలానే సినిమాల్లో కూడా కనిపిస్తారు. అలా తన లుక్ తో ట్రెండ్ సెట్ చేసిన హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ఒకడు.
అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ లో ఆయనకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో.. తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇక అందరి హీరోల్లా తెల్లజుట్టును కప్పిపుచ్చడానికి అజిత్ కలర్ వేసుకోడు. తను ఎలా ఉంటే అలానే కనిపిస్తాడు. ఒకానొక సమయంలో అజిత్ వైట్ హెయిర్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. విశ్వాసం సినిమాలో అజిత్ లుక్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఆ తరువాత ఇదే లుక్ ను మెయింటైన్ చేస్తూ వచ్చిన అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం లుక్ మార్చాడు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. నిజం చెప్పాలంటే అందులో సగానికి పైగా AI ని వాడి అజిత్ లుక్ మొత్తాన్ని మార్చేశారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు కానీ, తమిళ్ అభిమానులను ఒక మోస్తరుగా మెప్పించింది. ఇక వరుసగా అజిత్ కి ఇది నాలుగో పరాజయం. వలిమై, తునీవు, విడామయుర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఈ నాలుగు సినిమాలు అజిత్ కు పరాజయాలనే అందించాయి.
ఇక ఈసారి మాత్రం అజిత్ గట్టి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీకి దర్శకత్వం వహించిన అధిక్ కే అజిత్ మరో ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం అజిత్ కొత్త లుక్ లో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. తాజాగా అజిత్ న్యూ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గుండులా కనిపించే బేబీ కట్టింగ్ హెయిర్ స్టైల్ లో అజిత్ చాలా స్టైలిష్ గా కనిపించాడు.
బ్లూ కలర్ జాకెట్, బ్లాక్ కలర్ గాగుల్స్ తో చాలా కొత్తగా కనిపించాడు. సడెన్ గా ఈ లుక్ లో ఎవరు చూసినా అజిత్ ను గుర్తుపట్టడం కష్టమే. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు గుండు బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది సినిమా కోసమా.. ? లేక అజిత్ పర్సనల్ గా మెయింటైన్ చేస్తున్నాడా ? అనేది తెలియాల్సి ఉంది.
Phanindra Narsetti: రావణుడు బ్రాహ్మణుడు కాదా.. చివరకు ఏం చేశాడు