Anasuya: ఆదితో లింకులు.. అందుకే జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయా
ABN , Publish Date - Jul 16 , 2025 | 04:55 PM
అందాల హాట్ యాంకర్ అనసూయ (Anasuya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలు.
Anasuya: అందాల హాట్ యాంకర్ అనసూయ (Anasuya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలు. ఈ షో మొదలైనప్పటి నుంచి ఆమె తన అందాలను ఆరబోస్తూ తనతో పాటు ఆ షోకు కూడా ఒక గుర్తింపును తీసుకొచ్చింది. చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఆమె డ్యాన్స్ చేస్తుంటే కళ్ళప్పగించి చూసేవారు ప్రేక్షకులు. అసలు సగానికి పైగా ప్రేక్షకులు అనసూయ కోసమే జబర్దస్త్ చూసేవారు అంటే అతిశయోక్తి కాదు.
జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అనసూయ.. నెమ్మదిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే ఇంకోపక్క కుర్ర హీరోల సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా వివాదాలతో మరింతగా దగ్గరయిన అనసూయ సడెన్ గా జబర్దస్త్ ను వదిలేసింది. సినిమాల్లో అవకాశాలు ఎక్కువ రావడంతో ఆమె ఆ షో నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. అది కొంతవరకు వాస్తవమే అయినా.. ఇంకొంత వరకు హైపర్ ఆది వలనే బయటకు వచ్చేసిందని వార్తలు వినిపించాయి. ప్రతి స్కిట్ లో అనసూయ మీద ఆది వల్గర్ కామెంట్స్ చేయడం, అది బయటకు వేరేలా వెళ్లి.. అనుసూయపై ట్రోల్ జరగడంతో.. తట్టుకోలేని అనసూయ షో మానేసినట్లు ఇన్ టాక్.
ఒక ఇంటర్వ్యూలో కూడా అనసూయ ఇన్ డైరెక్ట్ గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. కమిట్ మెంట్ ఇచ్చిన పాపానికి కొన్ని కొన్ని మాటలు పడాల్సివచ్చిందని, ఆ ప్లేస్ లో కూర్చున్నాక మనసుకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని మాటలు అనాలని, కోప్పడకుండా నవ్వాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. అయితే ఉన్నా కొద్ది షోలో వల్గారిటీ ఎక్కువ అవ్వడం తో అది భరించలేకపోయినట్లు కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ నుంచి కొన్నేళ్ల క్రితం బయటకు వెళ్లిన అనసూయ.. చాలాకాలం తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా టీమ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ కు అనసూయతో పాటు నాగబాబు కూడా విచ్చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో అనసూయ.. ఆదిపై ఫైర్ అయ్యింది. అతని వలనే ఈ షో వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఆదితో కలిసి స్కిట్ చేసి అతనిని ఎంకరేజ్ చేస్తే.. తనకంటూ ఒక ప్రత్యేకత ఇవ్వలేదని ఆమె తెలిపింది. షో వదిలి వెళ్లేముందు ఎంతో అడుక్కున్నాను.. ఆది వద్దు వద్దు.. నాకు కొన్ని నచ్చడం లేదు అని చెప్పిన వినలేదని తెలిపింది. అంతేకాకుండా ఆదితో తనకు లింకులు అంటగడుతున్నారని, ఆది అందరిని నవ్వించడానికి మాట్లాడే మాటలు బయట వేరేలా అర్ధమయ్యి లింక్స్ పెడుతున్నారని, అందుకే తను జబర్దస్త్ వదిలి వెళ్లిపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Mega 157: పాట చిత్రీకరణలో చిరు, నయన్
Ghaati Movie: ఘాటీ.. మరో కొత్త డేట్ లాక్..