For OTT: షార్ట్ ఫిల్మ్ తో మొదలై... ఫీచర్ ఫిల్మ్ గా...

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:02 PM

షార్ట్ ఫిల్మ్ గా వచ్చిన రెండు భాగాలకు వీక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు ఏకంగా ఫీచర్ ఫిల్మ్ తీస్తున్నారు దర్శకుడు యోగి కుమార్. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

గతంలో యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించిన 'ఆ గ్యాంగ్ రేపు' (Aa Gang Rape) షార్ట్ ఫిల్మ్ కు సీక్వెల్ కూడా వచ్చింది. అదీ వీక్షకుల ఆదరణ పొందడంతో ఇప్పుడు దర్శకుడు యోగి కుమార్ 'ఆ గ్యాంగ్ రేపు 3'ని సినిమాగా తీశారు. అయితే అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. యోగి కుమార్ (Yogi Kumar) గతంలో 'లవ్ యూ టూ' అనే ఫీచర్ ఫిల్మ్ తీశారు.


WhatsApp Image 2025-07-16 at 4.06.34 PM (1).jpeg

నరేన్‌ అన్నసాగరం (Naren Annasagaram), ప్రీతి సుందర్‌ (Preeti Sundar) 'ఆ గ్యాంగ్ రేపు 3' చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు. దీన్ని సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. కన్నడ హిట్ మూవీ 'షుగర్ ఫ్యాక్టరీ' ఫేమ్ కబీర్ రఫీ ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు, కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ (Aata Sandeep) మాట్లాడుతూ, 'గ్యాంగ్ రేపు షార్ట్ ఫిలిమ్ బాగా వైరల్ అయిన తర్వాత దానికి రెండో భాగం తీశారు. అందులో నేను యాక్ట్ చేశాను. అదీ బాగా ఆడింది. దాంతో దీని మూడో పార్ట్ లో నటించమని నన్ను అడిగారు. ఇంత బోల్డ్ క్యారెక్టర్ నేను చేయలేననిపించింది. పైగా నాకు కొరియోగ్రాఫర్ గానే కొనసాగాలనే ఆలోచన ఉంది. దాంతో నో చెప్పాను. నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సినిమాలో దర్శకుడు చర్చిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఓటీటీలో అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను' అని అన్నాడు.


దర్శకుడు యోగి కుమార్ మాట్లాడుతూ, 'పదేళ్ళ క్రితం తీసిన 'గ్యాంగ్ రేపు' సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానికి సీక్వెల్ తీశాం. అదీ అడటంతో ఇప్పుడు నా మిత్రుడు దీనిని ఫీచర్ ఫిల్మ్ గా నిర్మించాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని తెలిపాడు. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారని, వారి శ్రమకు తగ్గ విజయం దక్కుతుందనే నమ్మకం ఉందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Mega 157: పాట చిత్రీకరణలో చిరు, నయన్

Also Read: Anasuya: ఆదితో లింకులు.. అందుకే జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయా

Updated Date - Jul 16 , 2025 | 05:25 PM