Kichcha Sudeep: రూత్ లెస్ కింగ్ మార్క్.. వస్తున్నాడు
ABN, Publish Date - Sep 01 , 2025 | 09:58 PM
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kichcha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాలో విలన్ గా పరిచయమైనా.. ఆ తరువాత హీరోగా ఇక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుదీప్ నేడు తన 51 వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఉదయం నుంచి సుదీప్ కు అభిమానులతోపాటు సెలబ్రిటీలు కూడా విషెస్ చెప్పుకొస్తున్నారు.
ఇక సుదీప్ పుట్టినరోజున ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అందించారు. ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న చిత్రం K47. విజయ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెంధిల్ త్యాగరాజన్ - అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తాజాగా సుదీప్ నటిస్తున్న 47 వ చిత్రానికి టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు మార్క్ అనే పేరును ఖరారు చేస్తున్నట్లు తెలుపుతూ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ లో సుదీప్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ మ్యాడ్, యాటిట్యూడ్, రూత్ లెస్, కింగ్ అంటూ ఒక్కోక్క పదానికి అర్ధంతో సహా చూపించారు.
ఇక చివర్లో సుదీప్ ఫేస్ ను చూపిస్తూ అతని పేరును అజయ్ మార్కండేయ అని తెలిపారు. ఇక ఆ పేరులోని అక్షరాలనే మార్క్ గా మార్చి.. టైటిల్ గా అనౌన్స్ చేశారు. ఇక విలన్స్ ను చితక్కొట్టడానికి సిద్దంగా ఉన్నట్లు సుదీప్ కనిపించాడు. ఇక ఈ సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్ గానే తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది. మరి ఈ సినిమాతో సుదీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Tuesday Tv Movies: మంగళవారం, సెప్టెంబర్ 02.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే
Mirai: మిరాయ్ లో మహేష్ బాబు.. నిజమెంత