Mirai: మిరాయ్ లో మహేష్ బాబు.. నిజమెంత

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:21 PM

ఈ AI వచ్చాక ఎవరు నిజమో.. ఏది అబద్దమో అనేది తెలియకుండా పోతుంది. ప్రతి సినిమాలో పౌరాణిక పాత్రల్లో కనిపించేవారు ఆ హీరోను పోలీ ఉన్నాడు..

Mirai

Mirai: ఈ AI వచ్చాక ఎవరు నిజమో.. ఏది అబద్దమో అనేది తెలియకుండా పోతుంది. ప్రతి సినిమాలో పౌరాణిక పాత్రల్లో కనిపించేవారు ఆ హీరోను పోలీ ఉన్నాడు.. ఈ హీరోను పెట్టి ఉంటారు అంటూ చర్చించుకోవడం.. చివరకు అది AI అని తెలిసి ఊసురుమనడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. తాజాగా మరోసారి అభిమానులకు నిరాశే మిగిలింది.


కల్కి సినిమా రిలీజ్ సమయంలో అందులో కృష్ణుడుగా కనిపించింది మహేష్ బాబు అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కాదని బాధపడ్డారు. ఇక మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమాలో కృష్ణుడు పాత్రలో మహేష్ నటించారు అన్నారు. అది కూడా కాదని తెలిసి అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాలో రాముడిగా మహేష్ కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మిరాయ్. మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ చైర్ట్రం సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ మధ్యనే మిరాయ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చివర్లో రాముడి అవతారాన్ని చూపించారు. ఇక రాముడిగా నటించింది మహేష్ బాబునే అని పుకార్లు షికార్లు చేశాయి.


ఇక తాజాగా ఈ పుకార్లపై హీరో తేజ సజ్జా స్పందించాడు. తాజాగా మిరాయ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజకు రాముడిగా మహేష్ బాబు నటించారు అంట నిజమేనా అన్న ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి సమాధానంగా తేజ మాట్లాడుతూ.. ' అది AI ద్వారా క్రియేట్ చేసిన రాముడు. మహేష్ బాబు కాదు' అని చెప్పుకొచ్చాడు. దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టే. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో తేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Peddi: పెద్ది మొదటి సింగిల్.. రెహమాన్ అదరగొట్టేశాడన్న చరణ్

Kannappa: ఎట్టకేలకు ఓటీటీకి వస్తున్న కన్నప్ప

Updated Date - Sep 01 , 2025 | 09:21 PM