Kayadu Lohar: విజయ్.. నీవి స్వార్ధపూరిత రాజకీయాలు.. కయాదు ఏం చెప్పిందంటే
ABN, Publish Date - Sep 28 , 2025 | 06:40 PM
ఇండస్ట్రీలో సంచలన సృష్టించే ఏదైనా ఒక ఘటన జరిగితే చాలు. కొంతమంది ఆ ఘటనను వాడుకొని ఫేమస్ అవ్వాలని చూస్తారు.
Kayadu Lohar: ఇండస్ట్రీలో సంచలన సృష్టించే ఏదైనా ఒక ఘటన జరిగితే చాలు. కొంతమంది ఆ ఘటనను వాడుకొని ఫేమస్ అవ్వాలని చూస్తారు. ఇంకొందరు స్టార్ సెలబ్రిటీలు పోస్టులు పెట్టినట్లు ఫేక్ పోస్టులు పెట్టి లైక్స్ తెప్పించుకోవాలని చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోఏది నిజమో.. ఏది అబద్దమో కూడా తెలుసుకోకుండా పోస్ట్ పెట్టగానే.. పేరు ఉంది అని వారిని ట్రోల్ చేయడం మొదలుపెడుతున్నారు ఫ్యాన్స్. అసలు ఏం జరిగింది అంటే.. గతరాత్రి తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెల్సిందే.
టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ ఘటన యావత్ ఇండియాను దిగ్బ్రాంతికి గురిచేసింది. కరూర్ లో జరిగిన ఈ ప్రచార సభకు విజయ్ ఆలస్యంగా రావడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఘటనకు కారణమైన విజయ్ ను అరెస్ట్ చేయాలనీ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడాడిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా కయాదు కూడా ఒక పోస్ట్ పెట్టింది.
'ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కరూర్ ర్యాలీలో నా అత్యంత సన్నిహితులలో ఒకరిని కోల్పోయాను. ఇదంతా టీవీకే స్వార్థ రాజకీయాల కోసమే. విజయ్, మీ స్టార్‌డమ్‌కు ప్రజలు ఆసరా కాదు. మీ ఆకలికి ఇంకా ఎన్ని జీవితాలు బలికావాలి' అని రాసుకొచ్చింది. ఇక పైన కయాదు అని పేరు ఉండడంతో అది ఆమెనో కాదో అని కూడా తెలుసుకోకుండా విజయ్ ఫ్యాన్స్ ఆమెపై దండయాత్ర ప్రారంభించారు. దీంతో కయాదు ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది. ఆ పోస్ట్ చేసింది తాను కాదు అని, అది ఫేక్ అని చెప్పుకొచ్చింది.
'నా పేరుతో పోస్ట్‌లు సర్క్యులేట్ చేస్తున్న ట్విట్టర్ ఖాతా నకిలీది. నాకు దానితో ఎటువంటి సంబంధం లేదు. అక్కడ చేసిన ప్రకటనలు నావి కావు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే, కరూర్‌లో నాకు వ్యక్తిగత స్నేహితులు ఎవరూ లేరని, నా పేరుతో వ్యాప్తి చెందుతున్న కథనం అబద్ధమని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయవద్దు. దుఃఖిస్తున్న కుటుంబాలకు నా ప్రార్థనలు ఎప్పుడు తోడుగా ఉంటాయి' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ పోస్ట్ పెట్టింది కయాదు కాదని క్లారిటీ వచ్చింది.
Kantara Chapter 1: తెలీదు శివుడా భక్తి మార్గం.. వరాహరూపం సాంగ్ ను మించి ఉందిగా
Monday Tv Movies: సోమవారం, Sep 29.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే