Kantara Chapter1: ఓటీటీకి వచ్చాక ఏముంది అంటారేంట్రా బాబు..

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:33 PM

థియేటర్ లో హిట్ అయిన సినిమాలు ఓటీటీలో హిట్ అవ్వాలని రూల్ లేదు అంటే నిజమే అని చెప్పొచ్చు.

Kantara Chapter 1

Kantara Chapter1: థియేటర్ లో హిట్ అయిన సినిమాలు ఓటీటీలో హిట్ అవ్వాలని రూల్ లేదు అంటే నిజమే అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ హిట్ గా థియేటర్ లో వందల కోట్లు రాబట్టిన సినిమా అయినా సరే ఓటీటీకి వచ్చాకా కొందరికి నచ్చడం లేదు. దీంతో థియేటర్ లో హిట్ టాక్ అందుకున్న సినిమాలు.. ఓటీటీలో నెగిటివ్ టాక్ అందుకుంటున్నాయి.

తాజాగా ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన లోక, కాంతార సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను అందుకుంటున్నాయి. ముఖ్యంగా కాంతార చాప్టర్ 1 పై అయితే నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

రిషబ్ డెడికేషన్, టేకింగ్ వేరే లెవెల్. ఇక రుక్మిణి వసంత్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీలోకి వచ్చినా కూడా ఇంకా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఓటీటీలో చూసిన ప్రేక్షకులు కాంతార చాప్టర్ 1 పై పెదవి విరుస్తున్నారు.

ఏముంది ఈ సినిమాలో.. ఎందుకు అంత హైప్ ఇచ్చారు. దీనికన్నా కాంతారనే బావుంది. సోది కామెడీ తప్ప ఏం లేదు. సినిమా మొత్తం చివరి 40 నిమిషాలు మాత్రమే.. అది చూస్తే చాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు.. రిషబ్ డైరెక్షన్ బావుంది.. సినిమాలో మాత్రం ఏమి లేదు అని చెప్పుకొస్తున్నారు. థియేటర్ లో ఆ రేంజ్ హిట్ చేసి.. ఇప్పుడు ఏం లెదు అంటారేంట్రా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

K Ramp: దీపావళి విన్నర్..  రూ.40 కోట్లకు పైగా గ్రాస్  

Operation Safed Sagar: ఆసక్తికరంగా ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ గ్లింప్స్‌

Updated Date - Nov 02 , 2025 | 04:33 PM