Kantara : Chapter 1: అక్టోబర్ 31 నుండి ఆంగ్లంలోనూ...

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:33 PM

రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార: చాప్టర్ 1' మూవీ ఇప్పుడు ఇంగ్లీష్ లోకి కూడా డబ్ అవుతోంది. అక్టోబర్ 31న ఈ సినిమా ఇంగ్లీష్‌ డబ్బింగ్ వర్షన్ ను విడుదల చేయబోతున్నారు.

Kantara: Chapter 1 Movie

అక్టోబర్ 31వ తేదీ రెండు పాన్ ఇండియా మూవీస్ కు మైల్ స్టోన్ గా నిలువబోతోంది. 'బాహుబలి, బాహుబలి 2' చిత్రాలను కలిపి ఒక్కటిగా చేసి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో రాజమౌళి వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. అలానే ఇటీవల వచ్చిన 'కాంతార : చాప్టర్ 1' సినిమాను కూడా అదే రోజున అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీష్‌ భాషలో డబ్ చేసి విడుదల చేయబోతోంది హోంబలే ఫిలిమ్స్ సంస్థ.


IMG_1102.PNG

రిషబ్ శెట్టి (Rishabh Shetty) నటించిన పాన్ ఇండియా మూవీ 'కాంతార : చాప్టర్ 1' (Kantara: Chapter 1) ఇప్పటికే ఎనిమిది వందలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి... ఈ యేడాది టాప్ గ్రాసర్ గా ప్రథమస్థానంలో నిలువబోతోంది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని రిషబ్ శెట్టి టీమ్ ఇప్పుడు ఇంగ్లీష్ లోకి దీనిని డబ్ చేసి రిలీజ్ చేస్తోంది. అయితే ఇంటర్నేషనల్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని 'కాంతార : చాప్టర్ 1' రన్ టైమ్ ను రెండు గంటల, నలభై ఐదు నిమిషాల, నలభై సెకన్లకు కుదించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ డబ్బింగ్ సినిమా తెలుగులోనూ వంద కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయడం విశేషం.

Also Read: Ilaiyaraaja: క్షమించే ప్రసక్తే లేదంటున్న మాస్ట్రో

Also Read: Mass Jathara Song: ఈ పాటకు అర్ధం లేదు పర్ధం లేదు.. తలా తోక అస్సలు లేదు

Updated Date - Oct 22 , 2025 | 06:33 PM