Darshan: ఒక చుక్క విషం ఇవ్వండి.. బతకలేకపోతున్నా
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:39 PM
కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దర్శన్.. రేణుకా స్వామి (Renuka Swami) హత్య కేసులో జైల్లో ఉన్న విషయం కూడా విదితమే.
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దర్శన్.. రేణుకా స్వామి (Renuka Swami) హత్య కేసులో జైల్లో ఉన్న విషయం కూడా విదితమే. తాజాగా ఆయన.. జైల్లో వసతులు ఏమి బాగాలేదని, ఇక్కడ బతకలేకపోతున్నా అని న్యాయమూర్తి ముందు కంటనీరు పెట్టుకున్నాడు. రేణుకా స్వామి హత్యకేసు విచారణ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ, సివిల్ కోర్టు ముందు దర్శన్ హాజరయ్యాడు.
ఈ విచారణలో భాగంగా దర్శన్ మాట్లాడుతూ.. 'బెంగుళూరు పరప్పన అగ్రహార జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ నేను బతకలేకపోతున్నా. గదిలో దుర్వాసన వస్తుంది. చాలారోజులుగా నేను సూర్యుడిని కూడా చూడలేకపోతున్నా. ఫంగస్ తీవ్రత నన్ను మరింత భయపెడుతుంది. వీటన్నింటి మధ్య నేను బతకలేను. ఒక చుక్క విషం ఇచ్చి నన్ను చంపండి. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
నటి పవిత్ర గౌడను సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు రేణుకా స్వామి అనే వ్యక్తిని దర్శన్ కిడ్నాప్ చేయించి హత్య చేశాడు. గతేడాది నుంచి ఈ కేసు కోర్టు లో నడుస్తోంది. గతేడాది డిసెంబర్ లో దర్శన్ కు బెయిల్ మంజూరు అవ్వగా.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు సవాలు చేసింది. దీంతో బెయిల్ ను నిరాకరించడంతో దర్శన్ జైల్లోనే జీవితాన్ని గడుపుతున్నాడు. చట్టానికి సెలబ్రిటీలు, సామాన్యులు ఒకటే అని.. అందరు ఖైదీలలానే దర్శన్ కూడా అని న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరి దర్శన్ ఆవేదనను న్యాయస్థానం అర్ధం చేసుకుంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
Allu Aravind: చిరంజీవి వచ్చారంటే.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది..
Nitiin: శ్రీను వైట్లతో నితిన్ కొత్త సినిమా..