Kamal- Rajini: ఒకే ఫ్రేమ్ లో కమల్, రజనీ
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:03 PM
ఇది కలా.. నిజమా.. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఆ కాంబినేషన్ నిజంగా సెట్ కాబోతోందా? కోట్లాది మంది ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఆ సూపర్ స్టార్లు కలిసి నటించబోయే సమయం ఆసన్నమైందా? ఎవరో అంటే డౌట్ పడొచ్చు.. స్వయంగా కథనాయకులే కన్ఫామ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
కమల్ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth) కోలీవుడ్ లోనే కాదు... ఆలోవర్ ఇండియన్ ఇండస్ట్రీనే షేక్ చేసే హీరోలు. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే దేశవ్యాప్తంగా సినీప్రియులకు పండగే. అయితే ఈ లెజండరీ యాక్టర్లు కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో, ఎంతో మంది అభిమానులు ఆశపడుతున్నారు. అయితే స్టార్ డమ్ దృష్ట్యా అది సాధ్యం కావడం లేదు. వారిని హ్యాండెల్ చేయగల దర్శకుడు లేడేమో అన్న అనుమానాలు ఉండేవి. అయితే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj ) , కమల్ హాసన్‌తో కలిసి పనిచేసినప్పటి నుంచి, కమల్‌ని, రజనీకాంత్‌ని ఒకే సినిమాలో తీసుకొస్తాడనే టాక్ చాన్నాళ్లుగా ఉంది. అయితే అదిప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది.
సైమా అవార్డ్స్ ఈవెంట్‌లో హోస్ట్‌లు ఈ ప్రాజెక్ట్ నిజమేనా అని అడిగితే.. కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చేశాడు. తమ కాంబినేషన్ మూవీని అఫీషియల్‌గానే కన్ఫర్మ్ చేశాడు. తాను రజనీ చాలా కాలం క్రితమే కలిసి వర్క్ చేయాలనుకున్నామని... అది త్వరలో జరగబోతోందని చెప్పేశాడు. ఇది బిజినెస్ పరంగా సర్‌ప్రైజ్ అవుతుందేమోనని అభిప్రాయపడ్డాడు. తమ కాంబో వల్ల ట్రేడ్‌లో భారీ నంబర్స్ రాబోతాయని హింట్ కూడా ఇచ్చాడు.
రీసెంట్‌గా లోకేష్, రజనీకాంత్‌తో 'కూలీ' (Coolie) సినిమాని డైరెక్ట్ చేశాడు, అంతకు ముందు కమల్‌తో 'విక్రమ్' (Vikram)తీశాడు. కమల్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా ఓకే చేసినా, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి బహుశా ఏడాదికి పైగానే పట్టొచ్చు. అయితే ఈ డ్రీమ్ కాంబో కోసం ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి చేయబోతున్న మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also: OG - Thaman: కొత్త ఇన్‌స్ట్రూమెంట్.. 117 మంది వాయిద్య కళాకారులతో...
Read Also: Navya Nair: నవ్య నాయర్ కు చేదు అనుభవం..