సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kalyani Priyadarshan: లోక తరువాత ఇలానా.. ఛఛ అస్సలు ఊహించలేదే

ABN, Publish Date - Oct 08 , 2025 | 07:22 PM

సాధారణంగా హీరోయిన్ అన్నాకా.. మూడు సాంగ్స్.. ఆరు సీన్స్ కే పరిమితమనే పేరు ఉంది. హీరో పక్కన రొమాన్స్ కు తప్ప ప్రాధాన్యత ఉండని పాత్ర అని కూడా చెప్పుకొస్తారు.

kalyani priyadarshan

kalyani priyadarshan: సాధారణంగా హీరోయిన్ అన్నాకా.. మూడు సాంగ్స్.. ఆరు సీన్స్ కే పరిమితమనే పేరు ఉంది. హీరో పక్కన రొమాన్స్ కు తప్ప ప్రాధాన్యత ఉండని పాత్ర అని కూడా చెప్పుకొస్తారు. కానీ, అవన్నీ ఒకప్పటి రోజులు. ఇప్పటి హీరోయిన్లు ఎలాంటి పాత్రకు అయినా సై అంటున్నారు. అందం చూపించడానికి, హీరోతో రొమాన్స్ చేయడానికి ఎవరు అంత టక్కున ఒప్పుకోవడం లేదు. ప్రాధాన్యత ఉన్న పాత్రకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అయితే మరింత మొగ్గు చూపిస్తున్నారు.


హీరోలు చేసిన విధంగానే యాక్షన్ చేస్తున్నారు. కత్తి యుద్దాలు, పోరాటాలు దేనికైనా సిద్ధం అంటున్నారు నటీమణులు. ఇక మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ అయితే ఏకంగా మొట్టమొదటి విమెన్ సూపర్ హీరోగా మారింది. లోక సినిమాతో ఆమె అందరినీ మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఒక స్ఫూర్తి నింపింది. ఇక నుంచి కళ్యాణి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపిస్తుందని నెటిజన్స్ సైతం ఎంతో ఆశగా ఎదురుచూసారు. కానీ, కళ్యాణి దానికి విరుద్ధంగా బెల్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించి వారికి షాక్ ఇచ్చింది.


కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ హీరోగా అర్జునన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జీనీ. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, కృతి శెట్టి, వామికా గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా అబ్ది అబ్ది అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ అరేబియన్ మ్యూజిక్ తో మరో మయ్యా మయ్యా సాంగ్ ను గుర్తుచేస్తుంది.


బెల్లీ డ్యాన్స్ తో కృతి, కళ్యాణి అందాలను ఆరబోస్తూ డ్యాన్స్ మూవ్స్ తో పిచ్చెక్కించారు. కానీ, కల్యాణిని మాత్రం ఫ్యాన్స్ ఇలా చూడలేకపోతున్నట్లు చెప్పుకొస్తున్నారు. లోక లాంటి సినిమాలో సూపర్ హీరోగా కనిపించినా ఆ కళ్యాణి ఇప్పుడు ఇలా హీరో పక్కన అందాలను ఆరబోస్తూ బెల్లీ డ్యాన్స్ చేయడం ఏంటి.. అలాంటి పాత్ర చేశాక ఇలాంటివి చేస్తే వాటికి ఉన్న గుర్తింపు పోతుంది. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణి లోక తరువాత రాంగ్ స్టెప్ తీసుకుందని చెప్పుకొస్తున్నారు.


అయితే జీనీ.. లోక కన్నా ముందే కళ్యాణి ఒప్పుకున్నా ప్రాజెక్ట్ అని, ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. మధ్యలో లోక రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడంతో ఇలాంటి సమస్యలు వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఏదిఏమైనా లోక లాంటి హిట్ తరువాత ఇలాగా కళ్యాణిని చూస్తామని అనుకోలేదని ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Kiran Abbavaram: నీకు థియేటర్స్ ఇవ్వమని ముఖం మీదనే చెప్తున్నారు..

Mitramandali: బన్నీ వాసు కొత్త బ్యానర్ పెట్టడానికి కారణం ఏమిటీ...

Updated Date - Oct 08 , 2025 | 08:15 PM