Kiran Abbavaram: నీకు థియేటర్స్ ఇవ్వమని ముఖం మీదనే చెప్తున్నారు..
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:55 PM
భాషాబిభేదం.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది బాగా కొనసాగుతోంది. సినిమాకు తెలుగువారు బానిసలు. ఎలాంటి సినిమా అయినా.. ఏ భాష నుంచి హీరోలు వచ్చినా కూడా కథ నచ్చితే ఆదరిస్తారు.
Kiran Abbavaram: భాషాబిభేదం.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది బాగా కొనసాగుతోంది. సినిమాకు తెలుగువారు బానిసలు. ఎలాంటి సినిమా అయినా.. ఏ భాష నుంచి హీరోలు వచ్చినా కూడా కథ నచ్చితే ఆదరిస్తారు. పరభాష హీరోలు అయినా సరే అక్కున చేర్చుకుంటారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం తెలుగువారికి అంత గౌరవం లేదు. వారి సినిమాలను తెలుగువారు ఆదరించినట్లు.. తెలుగువారి సినిమాలను ఇతర భాషలు ఆదరించడం లేదు. ఇందుకు నిదర్శనమే తమిళనాడులో తెలుగు హీరోకు థియేటర్లు అందకపోవడం.
కుర్ర హీరో కిరణ్ అబ్బవరం తనకు తమిళనాడులో థియేటర్లు ఇవ్వము అని ముఖాన చెప్పినట్లు ఒక ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా చెప్పుకురావడం ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తుంది. కె ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్.. తమిళనాడు తెలుగు సినిమాలకు సరైన స్క్రీన్స్ ఇవ్వడం లేదని వాపోయాడు. తమిళ్ హీరోలకు తెలుగులో స్క్రీన్స్ దొరుకుతున్నాయి కానీ, తమిళ్ లో తమకు స్క్రీన్స్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
'తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కి తెలుగులో థియేటర్స్ దొరికాయి. నేను తమిళ్ లో నా సినిమా రిలీజ్ చేయాలనుకున్నాను. కానీ, నాకు అక్కడ థియేటర్స్ దొరకలేదు. క సినిమాను తమిళ్ లో రిలీజ్ చేయాలనీ నేను ప్రయత్నించాను. కానీ, వారు నా ముఖం మీదనే నీకు థియేటర్స్ ఇవ్వము అని చెప్పారు. నా గుడ్ ఫిల్మ్స్ ను బ్యాడ్ ఫిల్మ్స్ డామినేట్ చేశాయి. ఒక ఐదు చిత్రాలు బావుంటే.. ఇంకో ఐదు చిత్రాలు బాలేదు. నన్ను చాలా ట్రోల్ చేశారు. ఈ మధ్యకాలంలో ట్రోల్ చేయడం సాధారణంగా మారిపోయింది. మన పక్కన ఎవరు ఉన్నారు అనేది కూడా పట్టించుకోవడం లేదు. సినిమాను బ్యాడ్ చేసినా పర్లేదు. కానీ, పర్సనల్ గా తీసి తిడుతున్నారు. అది బాధాకరం' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Vishwak Sen: అక్టోబర్ 10న ‘ఫంకీ’ టీజర్
Tollywood: మురళీ మోహనా... మజాకా...