Supreme Court: సరసమైన ధరలు లేకపోతే హాళ్లు ఖాళీగా అయిపోతాయి

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:33 PM

మల్టీప్లెక్స్‌లలోని సినిమా టిక్కెట్‌లకు ఆడిట్‌ చేసే విధంగా రికార్డులను నిర్వహించాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.


మల్టీప్లెక్స్‌లలోని (multiplex) సినిమా టిక్కెట్‌లకు (Ticket Rates) ఆడిట్‌ చేసే విధంగా రికార్డులను నిర్వహించాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే (Supreme Court Stay) విధించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏకరూప టిక్కెట్‌ విధానాన్ని (రూ.200 + జీఎస్టీ) ప్రశ్నిస్తూ హొంబలె ఫిల్మ్‌, మల్టిప్లెక్స్‌ల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర స్టే ఇచ్చారు. ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారించింది.

సెప్టెంబరు 30న ‘ఆడిట్‌ చేసే విధంగా రికార్డులను నిర్వహించాలి’ అని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం టిక్కెట్‌ ధరలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. మల్టిప్లెక్స్‌లలో వాటర్‌ బాటిల్‌కు రూ.100 వసూలు చేస్తున్నారని, ఇప్పటికే ధియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోందనీ, మరింత సహేతుకంగా ధరలను నిర్ణయించాలని, లేకపోతే హాళ్లు ఖాళీగా మారిపోతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ALSO READ: Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Phoenix: విజయ్ సేతుపతి కొడుకు కోసం మెగాఫోన్ పట్టిన అనల్ అరసు

Mastiii 4 : నవ్వులు పూయిస్తున్న మస్తీ 4 ట్రైలర్‌





Updated Date - Nov 04 , 2025 | 06:28 PM