Aaryan Movie: ఐయామ్ ది గాయ్.. మెలోడీ సాంగ్ అదిరిపోయింది
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:55 PM
కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి.
Aaryan Movie: కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. ఇక విష్ణు విశాల్ హీరోగా కాకుండా నిర్మాతగా కూడా మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఆర్యన్. డార్క్ అండ్ సస్పెన్స్ ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించగా విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ నిర్మించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాధ్ నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఆర్యన్ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఐయామ్ ది గాయ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పోలీస్ గా విష్ణు విశాల్ కనిపించాడు. అసలు ప్రేమ అంటే తెలియని హీరో.. హీరోయిన్ తో ప్రేమలో పడ్డాకా.. తనలో జరిగిన మార్పులను తనకు తానే చెప్పుకుంటున్నట్లు లిరిక్స్ ఉన్నాయి.
జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు. జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు. ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు.
Bunny Vasu: బ్రదర్ అంటూ పంచులు ఎవరికి..
Chiranjeevi: ఆస్ట్రేలియాలో చిరుతో భేటీ.. ఎందుకంటే..