Bunny Vasu: బ్రదర్‌ అంటూ పంచులు ఎవరికి..

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:48 AM

సోమవారం రాత్రి జరిగిన ‘మిత్రమండలి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్ర సమర్పకుడు బన్నీ వాసు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రదర్‌ మీరెంత ట్రోల్‌ చేసినా నన్ను పడగొట్టలేరు .. నా పరుగును ఎవరూ ఆపలేరు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు

Bunny Vasu

నెగటివ్‌ ట్రోలింగ్‌తో నన్ను తొక్కేయలేరు..

ఎంత ట్రోల్‌ చేసినా నా పరుగు ఆగదు..

నా యుద్ధం ధర్మమార్గంలోనే..

అలాంటి వాళ్ల కోసం ఆలోచించడం దండగ..

ట్రోలర్స్‌.. ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేయండి..

ఇంతకి ఆ బ్రదర్.. ఎవరు..

'మిత్ర మండలి’ ఈవెంట్‌లో బన్నీ వాసు ఘాటు వ్యాఖ్యలు..

సోమవారం రాత్రి జరిగిన ‘మిత్రమండలి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో  చిత్ర సమర్పకుడు బన్నీ వాసు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రదర్‌ మీరెంత ట్రోల్‌ చేసినా నన్ను పడగొట్టలేరు 
.. నా పరుగును ఎవరూ ఆపలేరు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. నెగటివ్‌ ట్రోల్స్‌తో వెంట్రుకే కాదు ఇంకేమీ పీకలేరని ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన బ్రదర్‌ అని సంభోదించింది ఎవరిని అనేది దానిపై చర్చ నడుస్తోంది.

థియేటర్‌కి రండీ.. ప్రతి నిమిషం నవ్వుతారు..

మిత్రమండలి ట్రైలర్‌ చూసి ఏ టైమ్‌లో నవ్వాలో చెప్పండని కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మీరు సినిమాకి రండి... ప్రతి నిమిషం నవ్వుతారు. లేదంటే మీరు ఏ కామెంట్‌ అయినా పెట్టుకోండి.. నేను తీసుకుంటాను’ అన్నారు బన్నీ వాసు. ప్రియదర్శి, రాగ్‌ మయూర్‌, విష్ణు, నిహారిక ఎన్‌ఎం కీలక పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్‌ ఎస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళ్యాణ్‌ మంతిన, భాను ప్రతాప్‌, విజయేందర్‌ రెడ్డి నిర్మించారు. బన్నీ వాసు సమర్పకుడు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదల కానుంది.


నాది ధర్మ యుద్ధం..

‘ఒక వారం నాలుగు సినిమాలు విడుదలైతే ఆ నాలుగూ బాగా ఆడాలని కోరుకునే మనస్తత్వం నాది. ఫేస్‌ బాల్‌ మాకే కాబట్టి మేము సిక్స్‌ కొట్టాలి. అందరు ఎదగాలి అందరితో పాటే మేము ఎదగాలి. ‘మిత్రమండలి’ ట్రైలర్‌కి చాలామంది కామెంట్స్‌ చేశారు. నెగిటివ్‌ ట్రోల్‌ చేస్తే ఒకడి ఎదుగుదల ఆగిపోతుందనుకుంటే అది మీ కర్మే. ఏ రంగంలో అయిన పోటీ మంచిదే. యుద్థం చేయడం తప్పు కాదు. కానీ దాన్ని ధర్మంగా చేయాలి. నా యుద్ధం ధర్మమార్గంలో ఉంటుంది. నేనైతే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటా. నా సినిమా బాగోగపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటా. అందుకే నాకు అన్ని సక్సెసులు వస్తున్నాయనుకుంటా. ఆడియన్స్‌ జడ్జిమెంట్‌కి రెస్పెక్ట్‌ ఇవ్వాల్సిందే. అయితే కావాలని నెగిటివ్‌గా ట్రోల్స్‌ చేస్తే అది చిన్న పిల్లల చేష్టలనే అనుకోవాలి. ‘బ్రదర్‌ కష్టపడదాం.. ఎదుగుదాం. పైన దేవుడు ఉన్నాడు.. కింద సినిమాను చూసే ప్రేక్షకుడు ఉన్నాడు. వాళ్లే చూసుకుంటారు. అదేదో చేస్తే.. బన్నీ వాసు పడిపోతాడు అనుకుంటే తప్పు. ఇలాంటి ట్రోల్స్‌ వల్ల నా వెంట్రుక కూడా పీకలేరు. నేను ఇంకో వెంట్రుక కూడా తీసి ఇవ్వొచ్చు. నా సంస్కారం అలాంటిది కాదు. మీరెంత ట్రోల్‌ చేసినా నా పరుగు ఆగదు.. నేను ఇక్కడితో ఆగిపోనూ పరుగెడుతూనే ఉంటా.. పరుగెడుతుండటంలో విజయం ఉంది. అలాంటి వాళ్ల కోసం ఆలోచిస్తే నేను ఇక్కడే ఆగిపోతానని కూడా తెలుసు.

డబ్బు ఎక్కువ డిమాండ్‌ చేయండి...

నన్ను, నా సినిమాను ఎంత్తైనా ట్రోల్‌ చేసుకోండి. కానీ ట్రోల్‌ చేసేవాళ్లు కాస్త డబ్బులు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మీ పాజిటివ్‌ ఎనర్జీని వేరే వాడిని పడగొట్టడానికి నెగటివ్‌గా మారుస్తున్నారు. పొగడ్తలకు తక్కువ తీసుకున్నా ఫర్వాలేదు., ఒకడిని తిట్టడానికి, పడగొట్టడానికి నెగటివ్‌ ప్రచారం చేయడానికి ఎక్కువ డిమాండ్‌ చేసి తీసుకోండి. సినిమా బాగుంటే ఆడుతుంది.. లేకపోతే ఫేస్‌ చేస్తాం అంతే. దీని గురించి ఎక్కువగా ఆలోచించే అంత లో యాటిట్యూడ్‌ కాదు నాది. బ్రదర్‌ మళ్లీ చెబుతున్నా.. సినిమా బావుంటే అందరివీ ఆడతాయి. పొద్దున్న అయితే అందరం కలిసుండాల్సిన వాళ్లం మొహమొహాలు చూసుకోవలసిన వాళ్లం.. అందరం ముందుకెళ్లాల్సివాళ్లమే’ అని బన్నీ వాస్‌ అన్నారు. ఆయన ఇంత ఘాటుగా ఇంతకుముందు మాట్లాడింది లేదు. ఈసారి ఒక్కసారిగా ఫైర్‌ అవ్వడంతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఎవరిని ఉద్దేశించి బన్నీ వాస్‌ కామెంట్స్‌ చేశారు. ‘బ్రదర్‌’ అన్నది ఎవరిని అనే దిశగా చర్చలు మొదలయ్యాయి.

Updated Date - Oct 14 , 2025 | 12:56 PM