Chiranjeevi: ఆస్ట్రేలియాలో చిరుతో భేటీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:52 PM
'మెగాస్టార్ చిరంజీవి గారిని షూటింగ్ స్పాట్‌లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవిగారితోపాటు హీరోయిన్ నయనతారను కూడా కలిశాం.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు (N Ramchander Rao) చిరంజీవిని (Chiranjeevi) కలిశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తన మనుమరాలు ఐరా ఆశిష్ (Ira Ashish) కోరిక మేరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చిరుని కలిసినట్లు చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఫోటోలు షేర్ చేశారు.
'మెగాస్టార్ చిరంజీవి గారిని షూటింగ్ స్పాట్‌లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవిగారితోపాటు హీరోయిన్ నయనతారను కూడా కలిశాం. సినీ విశేషాలు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి అనేక ఆలోచనలు ఇద్దరం పంచుకున్నాము. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మాకు ఆత్మీయంగా సమయం కేటాయించిన చిరంజీవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం మా కుటుంబానికి మరపురాని ఆనంద క్షణంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మీసాల పిల్లా అంటూ ఉదిత్ నారాయణ పాడిన పాట ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. ఆయన యాక్ట్ చేస్తున్న 'విశ్వంభరా' సమ్మర్ లో రిలీజ్ కానుంది