సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kerala Crime Files: కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ సీజ‌న్‌2.. ట్రైల‌ర్‌

ABN, Publish Date - Jun 17 , 2025 | 03:18 PM

కేర‌ళ‌లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క్రైమ్ వెబ్ సిరీస్ కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ రెండో సీజ‌న్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

kerala

రెండేండ్ల క్రితం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్న క్రైమ్ వెబ్ సిరీస్ కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ (Kerala Crime Files). గ‌తంలో కేర‌ళ‌లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ మొద‌టి భాగంలో అంతు చిక్క‌ని ఓ మ‌ర్డ‌ర్ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేశార‌నే నేప‌థ్యంలో చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్, ట్విస్టుల‌తో రూపొందించి ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్‌ను పంచారు. ఇప్పుడు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ సిరీస్‌లో కేర‌ళ‌ క్రైమ్ ఫైల్స్ రెండో సీజ‌న్ (Kerala Crime Files Season 2) స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

మ‌ల‌యాళ ప్ర‌ముఖ‌ న‌టులు అర్జున్ రాధా కృష్ణ‌న్ (Arjun Radhakrishnan), అజ్జు వ‌ర్గీస్ (Aju Varghese), లాల్ (Lal), ఇంద్రాన్స్ (Indrans) కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా అహ్మ‌వ్ క‌బీర్ (Ahammed Khabeer) ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. జూన్ 20నుంచి జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర బాష‌ల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఈ సీజ‌న్2 ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ సైతం వీక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను పంచేలా ఉంది. మీరూ చూసేయండి.

Updated Date - Jun 17 , 2025 | 03:18 PM