Nayanthara: షాకింగ్.. నయనతార ఇంటికి బాంబు బెదిరింపులు
ABN, Publish Date - Oct 08 , 2025 | 04:28 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇంటికి బాంబు బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సంచలనం రేకెత్తించాయి.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇంటికి బాంబు బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సంచలనం రేకెత్తించాయి. అల్వార్‌పేటలోని వీనస్ కాలనీలో ఉన్న నయన్ కొత్త ఇంటికి బాంబు దాడి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రత్తమైన పోలీసులు.. నయన్ ఇంట్లో తనిఖీలు మొదలుపెట్టారు. బాంబు డిస్పోజ్ బృందం. స్నిఫర్ డాగ్ స్క్వాడ్ వెంటనే నయనతార ఇంటికి చేరుకొని సోదాలు చేశారు. అక్కడ ఏది లేకపోవడంతో ఆ కాల్ నకిలీది అని పోలీసులు గుర్తించారు. ఇక ఆ సమయానికి నయన్, ఆమె భర్త విగ్నేష్ సైతం ఇంట్లో లేరని సమాచారం.
గత కొన్ని నెలలుగా తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు మరియు ప్రముఖుల నివాసాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెల్సిందే. దీనికి ఐదు రోజుల ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటి త్రిష మరియు స్వర్ణ మాల్యా ఇళ్లకు ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. అవేమి నిజం కాదని పోలీసులు నిర్దారించారు. అయితే ఈ నకిలీ కాల్స్ చేస్తుంది ఎవరు .. ? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఆ నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం నయన్ హైదరాబాద్ లో ఉంది. చిరంజీవి సరసన ఆమె మన శంకర వర ప్రసాద్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ విషయం తెలియడంతో ఆమె కంగారుపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాదిలోనే నయన్.. తన భర్తతో కలిసి అల్వార్‌పేటలోని వీనస్ కాలనీలో కొత్త ఇల్లుకు షిఫ్ట్ అయ్యారు. నయన్ తన కొత్త ఇల్లుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది.
Akkineni: నాన్న తమిళ చిత్రం... కొడుకు తమిళ డైరెక్టర్ తో చిత్రం...
War 2: అఫీషియల్.. వార్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే