War 2: అఫీషియల్.. వార్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:44 PM

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కూడా అలాగే అయ్యింది.

War 2

War 2: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కూడా అలాగే అయ్యింది. అసలు ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఎంట్రీనే సూపర్ అనుకుంటే.. అది హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో స్క్రీన్ పంచుకుంటున్నాడు అనేసరికి అసలు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. వార్ 2 కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు. ఎన్టీఆర్ లుక్ దగ్గరనుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు కూడా హైప్ మాములుగా ఇవ్వలేదు. హృతిక్ ను ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడని, ఎన్టీఆర్ ని హృతిక్ డామినేట్ చేస్తాడని, ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్లు బ్లాస్ట్ అని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకొని థియేటర్ కు వెళ్లారు.


ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 15 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ భారీ డిజాస్టర్ అయ్యింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని.. అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక మొదటిరోజు టాక్ విని చాలామంది ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. అలాంటివారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఎట్టేకలకు వార్ 2 ఓటీటీ బాట పట్టింది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.


అక్టోబర్ 9 నుంచి వార్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ ను ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. థియేటర్ లో చూసి సినిమా బాలేదన్నవారే.. ఓటీటీలో చూసి ఎలారా ఈ సినిమను థియేటర్ లో మిస్ అయ్యామని చెప్పుకొస్తున్నారు. మరి వార్ 2 కూడా ఇలాంటి మ్యాజిక్ ఏమైనా చేస్తుందా.. ? ఓటీటీలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Rashmika Mandanna: ఆ వివాదంపైఎవరు ఏమనుకున్నా పట్టించుకోను..

Varun Sandesh: 'కానిస్టేబుల్' కథేంటంటే...

Updated Date - Oct 08 , 2025 | 03:44 PM