Telusu Kada Trailer: ఆడదానికి ఆ కంట్రోల్ ఇవ్వకూడదు.. అదిరిపోయిన తెలుసు కదా ట్రైలర్

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:47 PM

టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)మంచి హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు.

Telusu Kada

Telusu Kada Trailer: టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)మంచి హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. జాక్ సినిమాతో చేతులు కాల్చుకున్న సిద్దు.. ఈసారి తనకు తగ్గ లవ్ స్టోరీతోనే వస్తున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన మొదటిసారి డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన చిత్రం తెలుసు కదా (Telusu Kada). సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా.. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు.


ఇప్పటికే తెలుసు కదా చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇద్దరమ్మాయిల ప్రేమలో పడి సిద్దు ఎలా నలిగిపోయాడు అనేది ట్రైలర్ లో చూపించారు. డైలాగ్స్ మాత్రం చాలా బావున్నాయి. ' నువ్వు ఏరోజు అయితే నీ ఆడదానికి నీ కన్నీళ్లు, బాధ చూపిస్తావో.. ఆరోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దానిచేతిలో పెట్టినవాడివి అవుతావు. బ్రదర్ ఆ కంట్రోల్ ఎప్పుడు వారికి ఇవ్వొద్దు' అని సిద్దు చెప్పే ఎమోషనల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది.


కథ ఏంటి అనేది పూర్తిగా చెప్పలేదు కానీ.. సిద్దు.. రాశీ, శ్రీనిధితో ప్రేమలో పడడం, రొమాన్స్ చూపించారు. ఇద్దరినీ ఒకే ఇంటికి తీసుకొచ్చి వారితో కలిసి ఉండాలనుకోవడం, దాని వలన సిద్దు ఎదుర్కున్న సమస్యలు ఏంటి.. ? అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సిద్దు చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇద్దరు ముద్దుగుమ్మల అందం సినిమాకు మరింత హైలైట్ అయ్యేలా ఉంది అని చెప్పొచ్చు. ఇక థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు. అక్టోబర్ 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Rishab Shetty: 'ఛావా' తర్వాత 'కాంతార - చాప్టర్ 1'....

Narne Nithin: శ్రీవారిని దర్శించుకున్న నూతన వధూవరులు

Updated Date - Oct 13 , 2025 | 03:47 PM