సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kotha Lokah: లోక ఓటీటీ రిలీజ్.. దుల్కర్ ఏం చెప్పాడంటే

ABN, Publish Date - Sep 21 , 2025 | 04:56 PM

సాధారణంగా హిట్ సినిమా అయినా ప్లాప్ సినిమా అయినా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పడుతుంది. కానీ, ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన సినిమా ఓటీటీకి రావడానికి కొద్దిగా టైమ్ పడుతుంది.

Kotha Lokah

Kotha Lokah: సాధారణంగా హిట్ సినిమా అయినా ప్లాప్ సినిమా అయినా నెల తిరక్కుండానే ఓటీటీ బాట పడుతుంది. కానీ, ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన సినిమా ఓటీటీకి రావడానికి కొద్దిగా టైమ్ పడుతుంది. ఎందుకంటే.. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలను ప్రేక్షకులు మిస్ కాకూడదు అని.. మేకర్స్ ఇప్పుడప్పుడే ఆ సినిమాలను ఓటీటీకి ఇవ్వడం లేదు. తాజాగా కొత్త లోక విషయంలో కూడా అదే జరిగింది. మలయాళ ఇండస్ట్రీలో మొట్టమొదటి లేడీ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కిన చిత్రం కొత్త లోక (Kotha Lokah).


కళ్యాణి ప్రియదర్శన్, నెస్లేన్ ప్రధాన పాత్రల్లో డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఆగస్టు 28 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు 267 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఇంకా ఈ సినిమా థియేటర్ లో సక్సెస్ ఫుల్ రన్ అవుతుంది. ఇక కొన్నిరోజుల నుంచి కొత్త లోక ఓటీటీలోకి అడుగుపెడుతుంది అని వార్తలు వస్తున్నాయి.


కొత్త లోక సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 26 న ఓటీటీలోకి వస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ పై దుల్కర్ సల్మాన్ స్పందించాడు. ఎందుకంత తొందర అనే క్యాప్షన్ తో... ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ' లోకా త్వరలో ఓటీటీలో రావడం లేదు. నకిలీ వార్తలను నమ్మకండి. అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండండి.' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో లోక ఓటీటీ వార్తల రూమర్స్ కు చెక్ పడింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో చూడాలి.

Naga Durga: నాగ‌దుర్గ.. కొత్త బ‌తుక‌మ్మ పాట! సిరిమ‌ల్లె చెట్టుకింద

Tamannaah Bhatia: త‌మ‌న్నా.. ఇలా త‌యారైందేంటి! దాచాల్సింది ఏమీ లేదు.. అంతా ఓపెన్‌

Updated Date - Sep 21 , 2025 | 04:56 PM