Naga Durga: నాగ‌దుర్గ.. కొత్త బ‌తుక‌మ్మ పాట! సిరిమ‌ల్లె చెట్టుకింద

ABN , Publish Date - Sep 21 , 2025 | 04:23 PM

బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నాగదుర్గ నర్తించిన సిరిమల్లె చెట్టుకింద పాట విడుదలైంది.

Naga Durga

మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌ల్లె పాట‌ల‌కు ఉండే క్రేజే వేరు. సినిమాల స్థాయిలో మేకింగ్‌, టేకింగ్‌తో నిత్యం వంద‌ల‌మంది త‌మ టాలెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను రంజింప చేస్తున్నారు. అంతేగాక అయా పండుగ‌లు, ఇత‌ర వేడుక‌ల స‌మ‌యంలో సంద‌ర్భానుసారం పాట‌లు విడుద‌ల చేస్తూ ప్ర‌జాభిమానం చూర‌గొంటున్నారు.

తాజాగా తెలంగాణలో బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అనేక మంది క‌ళాకారులు త‌మ ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు తీస్తూ త‌మ‌దైన శైలిలో పాట‌లు రూపొందించి జ‌నాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఎంతోమంది అగ్ర జాన‌ప‌ద క‌ళాకారిణిలు పాట‌లు విడుద‌ల చేశారు.

ఈ కోవ‌లోనే ప్ర‌జ‌ల్లో చాలా ఫాలోయింగ్ ఉన్న‌, నిత్యం త‌న పాట‌ల‌తో ట్రెండింగ్‌లో ఉండే నాగ‌దుర్గ ( NAGA DURGA) న‌ర్తించిన‌, న‌టించిన సిరిమ‌ల్లె చెట్టుకింద (SIRIMALLE CHETTU KINDA) అంటూ సాగే బ‌తుక‌మ్మ పాట యూట్యూబ్‌లో విడుద‌లైంది.

ఈ పాట‌కు ప్ర‌శాంత్ ఓరుగంటి ( PRASANTH ORUGANTI) సంగీతం అందించ‌గా వొల్లాల వాణి కిశోర్ (VOLLALA VANI KISHOR), హ‌నుమంత్ యాద‌వ్ (HANUMANTH YADAV) ఆల‌పించారు. డా. వెన్నెల శ్రీనాధ్ (DR. VENNELA SREENATH) సాహిత్యం అందిచారు.

అయితే పాట సాహిత్యం, నృత్యం, నాగ‌దుర్గ త‌న చూపులు, అందంతో ఆక‌ట్టుకున్నా పాట పాడిన వారి వాయిస్ స‌రిగ్గా యాప్ట్ గా లేద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 04:23 PM