Drishyam 3: ఇదెక్కడి.. 'దృశ్యం' రా మామ! ఇంకా షూటింగ్ కాలే.. అప్పుడే సంచలనాలు
ABN, Publish Date - Dec 02 , 2025 | 06:39 PM
మాలీవుడ్ కొత్త చరిత్ర రాస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ మాత్రమే పాన్ ఇండియా సెన్సేషన్ అవ్వగా.. ఇప్పుడు మాలీవుడ్ కూడా ఆ జాబితాలో చేరింది. తాజాగా ఓ ప్రాజెక్ట్ బిజినెస్ సంచలనాలకు వేదికవుతోంది.
మాలీవుడ్ మోస్ట్ థ్రిల్లింగ్ ఫ్రాంచైజీ.. 'దృశ్యం'.. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు భారీ విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం మోహన్‌లాల్ , జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దృశ్యం 3’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కానీ ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
'దృశ్యం 3' సినిమా రూ.350 కోట్లకుపైగా ప్రీ-బిజినెస్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. పార్ట్ 3 మళయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ వెర్షన్లతో కలిపి పాన్ఇండియా రిలీజ్‌గా రూపొందుతోన్నందున ఈ భారీ ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. అయితే మళయాళ పరిశ్రమలో ఇప్పటివరకు ఒక్క సినిమాకూ ఈ రేంజ్ బిజినెస్ జరగలేదని అనలిస్టులు అంటున్నారు.
గతంలో మళయాళంలో ఎన్ని బ్లాక్‌బస్టర్లు వచ్చినా, పూర్తి థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత కూడా రూ.200 నుంచి 250 కోట్లు దాటడం రేర్. కానీ ‘దృశ్యం 3’ షూటింగ్ ముగియక ముందే రూ.350 కోట్ల ప్రీ-సేల్స్ సాధించడం... ఇది మళయాళ సినిమా మార్కెట్ ఎంత పెద్దదైందో చెప్పకనే చెబుతోంది..కాగా.. మొదటి రెండు భాగాలు మలయాళంలోనే కాకుండా హిందీ, తెలుగు రీమేక్‌లుగా కూడా బ్లాక్‌బస్టర్ అయ్యాయి.
అందుకే ఈ సారి రీమేక్ హక్కులు అమ్మకుండా నేరుగా నాలుగు ప్రధాన భాషల్లో ఒరిజినల్‌నే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇటీవల ‘లోక చాప్టర్ 1: చంద్ర’ రూ.300 కోట్లు దాటి మళయాళం ఇండస్ట్రీకి కొత్త బెంచ్‌మార్క్ పెట్టింది. కానీ ట్రేడ్ అంచనాల ప్రకారం ‘దృశ్యం 3’ ఆ రికార్డును చాలా ఈజీగా బద్దలు కొట్టే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Read Also: Deepika-Priyanka: కల్కి2లో ప్రభాస్ జోడీగా ప్రియాంక చోప్రా.. ?
Read Also: Goat Teaser: అమ్మాయిని లేపుకొచ్చి రచ్చ చేసిన సుడిగాలి సుధీర్