Deepika-Priyanka: కల్కి2లో ప్రభాస్ జోడీగా ప్రియాంక చోప్రా.. ?

ABN , Publish Date - Dec 02 , 2025 | 06:21 PM

తెలిసిపోయింది... ఫైనల్లీ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే బ్యూటీ ఎవరో ఫైనల్ అయింది. కన్ఫమో లేదో తెలియదు కానీ.. విషయం మాత్రం వైరల్ గా మారిపోయింది.

‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసిన తర్వాత సీక్వెల్‌పై అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయికి చేరాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అంతా బాగుందని అనుకున్న సమయంలో.. అనూహ్యంగా సీక్వెల్‌లో దీపికా పడుకోణె ను మూవీ నుంచి తప్పించారు. దీంతో దీపిక ప్లేస్ లో కొత్త లీడింగ్ లేడీ ఎవరన్న ప్రశ్న సోషల్ మీడియా నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకు బిగ్ డిబేట్ గా మారింది. అయితే దీనిపై ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది.


ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో 'కల్కీ 2'లో నటించబోయే బ్యూటీ పేరు ఒకటి బలంగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ ఎవరో కాదు గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా పేరే. ప్రస్తుతం 'కల్కీ' ఫ్రాంచైజీని పాన్ ఇండియా స్థాయి నుంచి నేరుగా ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దీంతో ప్రభాస్‌తో కలిసి ప్రియాంక ఉంటే హాలీవుడ్, యూరప్, ఆసియా మార్కెట్లలోనూ భారీ ఓపెనింగ్స్, బజ్ వచ్చే అవకాశం ఉందని టీమ్ టీమ్ భావిస్తుందని టాక్.

మొదటి పార్ట్‌లో దీపిక రోల్ నే కథకు అత్యంత కీలకం. ఆమె గర్భిణీగా కనిపించిన సన్నివేశాలు, ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేశాయి. అందుకే సీక్వెల్‌లో ఆమె లేకపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది. దీపిక తన ఇటీవలి ఇంటర్వ్యూలలో రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పిన వ్యాఖ్యలు.. అదే కారణంతో ‘స్పిరిట్’ నుంచి కూడా తప్పుకోవడం వంటి వార్తలు ఈ నిర్ణయానికి నేపథ్యమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీపిక ఔట్ అయిన వెంటనే అనుష్క శెట్టి, సాయి పల్లవి, శ్రుతి హాసన్ వంటి పేర్లు గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు టాప్‌లో నిలిచింది. .మరి చివరికి కల్కి ఫ్రాంచైజీలో ప్రభాస్‌తో జత కడతారా ప్రియాంక చోప్రా? లేదా వేరే హీరోయిన్‌నే ఫిక్స్ చేస్తారా? అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం వేచి చూడాల్సిందే.

Read Also: Samantha: సమంత.. ఓ ప్లానింగ్‌.. ఓ పద్దతి.. చప్పుడు లేకుండా పెళ్లి..

Read Also: Akkineni Sobhita: సమంత పెళ్లి.. శోభితాకు క్షమాపణ చెప్పాలిందే

Updated Date - Dec 02 , 2025 | 06:27 PM