Director Vijay Milton: రాజ్ తరుణ్‌ హీరోగా 'గాడ్స్ అండ్ సోల్జర్'

ABN , Publish Date - Aug 27 , 2025 | 07:27 PM

వినాయక చవితి పర్వదినాన విజయ్ మిల్టన్ తన తాజా చిత్రానికి 'గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌' (Gods and Soldiers) అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

Gods and Soldiers Movie

'గోలీసోడా', గోలీసోడా - 2' చిత్రాల దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్‌ (Vijay Milton) దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ (Raj Tharun) కథానాయకుడు. ఆయన చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మాణంలో జరుపుకుంటోన్న ఈ చిత్రానికి వినాయక చవితి పర్వదినాన 'గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌' (Gods and Soldiers) గా టైటిల్‌ని ఫిక్స్‌ చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.


ప్రముఖ తమిళ కథానాయకులు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), విజయ్‌ ఆంటోని, ఆర్యలతో పాటు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) తమ ఎక్స్‌ అకౌంట్‌ వేదికగా టైటిల్‌ను ట్విట్‌ చేసి శుభాకాంక్షలు అందజేశారు. దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ 'గోలీసోడా లోని రఫ్‌నెస్‌ను, న్యూ చాప్టర్‌లోని ఈ సినిమాలో ఆడియన్స్‌ చూడబోతున్నారు. ఈ టైటిల్‌ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌తో మా సినిమాపై ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. ఈ సందర్బంగా మా టైటిల్‌ టీజర్‌ను తమ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మమ్మల్ని సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు' అని అన్నారు. రాజ్ తరుణ్‌, సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్యామ్‌ సీఎస్‌, ఫోటోగ్రఫీ విజయ్‌ మిల్టన్‌.

Also Read: Mohan G: సాగర గర్భంలో 'ద్రౌపది -2' ఫస్ట్ లుక్ లాంచ్

Also Read: Pushpa 2 Vinayaka: పుష్ప 2.. వినాయకుడు! ఇదెక్క‌డి అభిమానంరా నాయ‌నా

Updated Date - Aug 27 , 2025 | 07:36 PM

Raj Tarun Controversy: కాంట్రవర్సీ ఏమైనా సినిమాకి హెల్ప్ అవుతుందా? మిగతా ప్రచారాలకు వస్తారా?

Raj Tarun - Lavanya Case: రాజ్ తరుణ్‌కు భారీ ఊరట

Raj Tarun - Lavanya Case: లావణ్య తల్లిదండ్రులు ఆవేదన.. ఇద్దరినీ కలపాలనే!

Raj Tarun - Lavanya Case: లావణ్య రాజ్ తరుణ్ కేసులో వ్యక్తి అరెస్ట్.. ఎవరంటే

Raj Tarun - Lavanya: కౌన్సిలింగ్‌ ఇచ్చి.. స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు!