Pushpa 2 Vinayaka: పుష్ప 2.. వినాయకుడు! ఇదెక్క‌డి అభిమానంరా నాయ‌నా

ABN , Publish Date - Aug 27 , 2025 | 07:10 PM

వినాయక చవితి (Vinayaka Chavithi) రాగానే ప్రతి వీధి, ప్రతి కాలనీ గణేశ మండపాలతో కిక్కిరిసిపోతుంది.

Pushpa 2 Vinayaka

వినాయక చవితి (Vinayaka Chavithi) రాగానే ప్రతి వీధి, ప్రతి కాలనీ గణేశ మండపాలతో కిక్కిరిసిపోతుంది. ఈ పండుగలో విగ్రహాల ఎంపికలోనే కాదు, మండపాల డిజైన్‌లో కూడా యువత తమ క్రియేటివిటీని అద్భుతంగా చూపిస్తుంటారు. ముఖ్యంగా సినిమాల ప్రభావం వినాయక మండపాలపై స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో బాహుబలి సెటప్, రోబో ఇంకా చాలా చిత్రాల‌ థీమ్‌తో విగ్రహాలను ప్రతిష్టించిన ఘటనలు మనం చూశాం.

ఇప్పుడు కూడా అలాగే.. ఈసారి తమిళనాడు (Tamilnadu)లోని డెంకానియ కొట్టాయ్ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) థీమ్ మండపం నిలిచింది. ఏకంగా ₹30 లక్షల ఖర్చుతో ఎర్ర చందనం దుంగల రూపకల్పనలో మండపాన్ని తీర్చిదిద్దారు.

ఎంట్రన్స్ వద్దనే హెలికాప్టర్ పక్కన గన్ పట్టుకున్న పుష్పరాజ్ (Pushpa Raj) విగ్రహం ఉండగా, లోపలికి వెళ్ళాక గంగమ్మ జాతర సన్నివేశం తరహాలో చీర కట్టులో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. అంతేకాక, క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ (పుష్పరాజ్) త్రిశూలం పట్టుకొని కనిపించే సీన్‌ను తలపించేలా వినాయకుడిని తీర్చిదిద్దడం విశేషం.

సినిమా హీరోలపై ఉన్న అభిమానాన్ని పండుగ సంబరాల్లో ఇలా వినూత్నంగా ప్రదర్శించడం అభిమానుల ప్రత్యేకతగా మారింది. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాల థీమ్‌లను కూడా వినాయక మండపాల్లో చూసాం. ఈసారి మాత్రం పుష్ప 2 హవా మరింతగా కనపడుతోంది.

ఈ క్రియేటివ్ పుష్ప మండపం, విగ్రహాల ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “తగ్గేదే లే” అన్న పుష్పరాజ్ డైలాగ్ మాదిరిగానే అభిమానులు కూడా తమ భక్తిని, క్రియేటివిటీని తగ్గించక పోవడం గమనార్హం.

Updated Date - Aug 27 , 2025 | 07:10 PM