Mohan G: సాగర గర్భంలో 'ద్రౌపది -2' ఫస్ట్ లుక్ లాంచ్

ABN , Publish Date - Aug 27 , 2025 | 06:49 PM

వినాయక చవితి సందర్భంగా చారిత్రక చిత్రం 'ద్రౌపది -2' ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినూత్నంగా సాగర గర్భంలో మేకర్స్ రిలీజ్ చేశారు.

Draupathi -2 Movie

నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ద్రౌప‌ది -2’ (Draupathi 2). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 'ప‌ళయ వ‌న్నార‌పేట్టై, ద్రౌప‌ది, రుద్ర తాండ‌వం, బ‌కాసుర‌న్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన మోహ‌న్‌ జి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినూత్నంగా సాగర గర్భంలో మేకర్స్ రిలీజ్ చేశారు.


'ద్రౌపది -2' 14వ శ‌తాబ్దానికి చెందిన క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఆ స‌మ‌యంలోనే మొఘ‌ల్ చక్రవర్తులు త‌మిళ‌నాడులోకి ప్రవేశించారు. ర‌క్తంతో రాసిన చ‌రిత్రాక ఘ‌ట‌నల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు, వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా నిలిచారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్‌ను సెంజి, తిరువ‌ణ్ణామ‌లై, కేర‌ళ‌ల‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన 'ద్రౌపది' సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందనే విషయం ప్రధానాంశంగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని ఇదే యేడాది చివరిలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


'ద్రౌపది -2' సినిమాలో రిచ‌ర్డ్ రిషి (Richard Rishi), రక్షణ ఇందుసుద‌న్ (Rakshana Indusudan) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. న‌ట్టి న‌ట‌రాజ్ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్నారు. వై.జి.మ‌హేంద్రన్, 'నాడోడిగ‌ల్' భ‌ర‌ణి, శ‌ర‌వ‌ణ సుబ్బయ్య, వేల్ రామ‌మూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గ‌ణేష్ గౌరంగ్, దివి, దేవ‌యాని శర్మ, అరుణోద‌య‌న్ త‌దిత‌రులు ఇత‌ర పాత్రల్లో న‌టిస్తున్నారు. మోహ‌న్‌.జి, ప‌ద్మ చంద్రశేఖర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్‌, ఫిలిప్ ఆర్‌.సుంద‌ర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. థ‌నికా టోని కొరియోగ్రఫీ, యాక్షన్ సంతోష్, ఎడిట‌ర్‌గా దేవ‌రాజ్‌, ఆర్ట్ డైరెక్టర్ గా క‌మ‌ల‌నాథ‌న్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Also Read: Anushka Shetty: ఘాటీ సినిమాకు అదే మైనస్ కానుందా...

Also Read: Mirai Movie: అనుకున్న డేట్ కే మిరాయ్.. పోటీ తప్పదా

Updated Date - Aug 27 , 2025 | 06:58 PM