Parineeti Chopra: పరిణీతి, రాఘవ్ చద్దా దంపతుల గుడ్ న్యూస్..
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:17 PM
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా (pariniti chopra) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా (Parineeti Chopra) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 2023లో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను (Raghav Chadda) వివాహమాడిన సంగతి తెలిసిందే! త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతోందని సోషల్ మీడియా ఈ జంట తెలిపారు. ఇరువురూ చేతులు పట్టుకొని నడుస్తున్న వీడియోు షేర్ చేస్తూ.. ‘త్వరలో మా జీవితాల్లోకి మరో చిన్న ప్రపంచం రాబోతోంది’ అంటూ రాసుకొచ్చారు. దీంతో అభిమానులు బాలీవుడ్ తారలు పరిణితీ, రాఘవ్ చద్దా జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల కపిల్ షోలో పాల్గొన్న ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని హింట్ ఇచ్చారు. ఇప్పుడు 1+1=3 అనే పోస్ట్‌తో తల్లిదండ్రులు కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
2023 సెప్టెంబర్‌లో వీరిద్దరూ వివాహబంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్, ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రియాంకా చోప్రా కజిన్ సిస్టర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పరిణీత 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’లో కీలక పాత్ర పోషించారు. ‘కిల్ దిల్’, ‘డిష్యూం’, ‘గోల్‌మాల్ అగైన్’, శుద్ద్ దేశీ రొమాన్స్, ‘కేసరి’, ‘సైనా’ వంటి చిత్రాల్లో నటించి అలరించారు. 2024లో ‘అమర్ సింగ్ చంకీల’తో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా ఒకటి సెట్స్‌పై ఉంది.