Bison Trailer: విక్రమ్ కొడుకు నట విశ్వరూపం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న బైసన్ ట్రైలర్
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:44 PM
చియాన్ విక్రమ్ (Vikram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో తను ఎంత పెద్ద స్టారో.. తెలుగులో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నవాడు.
Bison Trailer: చియాన్ విక్రమ్ (Vikram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో తను ఎంత పెద్ద స్టారో.. తెలుగులో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నవాడు. ఇక ఇప్పుడు విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) తండ్రిలానే ఇండస్ట్రీని ఏలడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికీ రెండు సినిమాలు చేసినా.. అవేమి లెక్కలోకి రావని చెప్పి తన మొదటి సినిమా బైసన్ అని చెప్పుకొచ్చి హీట్ పెంచాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ నటిస్తున్న చిత్రం బైసన్. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మరియు నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పిఏ. రంజిత్, అదితి ఆనంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక బైసన్ చిత్రంలో ధృవ్ సరసం అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బైసన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మారి సెల్వరాజ్ సినిమాలు ఎంత రా అండ్ రస్టిక్ గా ఉంటాయో.. ఇది కూడా అలానే ఉంది. కబడ్డీ అంటే ప్రాణం పెట్టే ఊరు. ఆ ఊరిలో పుట్టినవాడే కిట్టు. చిన్నతనం నుంచి కబడ్డీ అంటే ప్రాణంగా పెరుగుతాడు. కానీ, అదే ఊరిలో రెండు గ్రూపుల మధ్య ఉన్న పగ.. కిట్టును కబడ్డీకి దూరం చేసి ఇంటిమీదకు గొడవలను తీసుకువస్తుంది. దీంతో కిట్టు తండ్రి కబడ్డీ వద్దని చెప్తాడు.
కబడ్డీ అంటే ప్రాణమైన కిట్టు.. తన ఊరు తరుపున ఆడి.. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇక కులం తక్కువ వారని కిట్టును ఎదగనివ్వకుండా చేయడానికి శత్రువులు ఏం చేశారు.. ? చివరికి కిట్టు అనుకున్నది సాధించాడా.. ? తనతో ప్రేమలో ఉన్న అమ్మాయిని దక్కించుకున్నాడా.. ? అనేది సినిమా కథగా తెలుస్తోంది. మారి సెల్వరాజ్ సినిమాలు అంటే పేద వర్గాల అణచివేత, సమానత్వం లాంటివాటి గురించే ఉంటాయి. ఈ సినిమా కూడా అదే పంథాలో కనిపిస్తుంది. ధృవ్ నటన మాత్రం నెక్స్ట్ లెవెల్. కబడ్డీ ఆడుతున్నప్పుడు, యాక్షన్ సీన్స్.. ఎమోషనల్ సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించాడు. అక్టోబర్ 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విక్రమ్ కొడుకు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Kantara Chapter 1: కాంతార కోసం రిషబ్ ఎంతలా కష్టపడ్డాడో చూడండి..
Mouli Tanuj: ఒరేయ్.. అఖిల్.. అప్పుడే అంత రెమ్యూనరేషనా