Halagali: డాలీ ధనంజయ చారిత్రక చిత్రం
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:32 AM
సుఖేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల 'హలగలి' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని రెండు భాగాలుగా నిర్మించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
'పుష్ప' చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడైన డాలీ ధనంజయ్ (Daali Dhananjaya) కన్నడలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'నాదప్రభు కెంపెగౌడ' చారిత్రక చిత్రం తర్వాత మరోసారి హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు డాలీ ధనంజయ్. బ్రిటీషర్స్ పై గొరిల్లా వార్ చేసిన బేడా వీరుల గాథను 'హలగలి' (Halagali) పేరుతో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. మొదట్లో ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకు డార్లింగ్ కృష్ణను అనుకున్నా... ఆ తర్వాత ఇది డాలీ ధనంజయ్ ను వరించింది.
సుఖేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల 'హలగలి' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని రెండు భాగాలుగా నిర్మించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా గ్లింప్స్ ను విడుదల చేశౄరు. ఈ సందర్భంగా డాలీ ధనంజయ మాట్లాడుతూ, 'హలగలి అనేది అన్ టోల్డ్ స్టోరీ. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా అనిపిస్తుంది. హలగలి కర్ణాటకలో గ్రేట్ ఎమోషన్. నిర్మాత కళ్యాణ్, డైరెక్టర్ సుకేష్ చాలా ప్యాషన్ తో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. కథ వినగానే ఈ ప్రాజెక్టులో పార్ట్ అవ్వాలి అనిపించింది. తప్పకుండా ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది' అని అన్నారు. హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ, 'ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన చాప్టర్. త్వరలోనే నా క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ కాబోతోంది. చాలా మాస్ క్యారెక్టర్ చేశాను. ఇది మన నేల కథ. డైరెక్టర్ చాలా అద్భుతంగా రాశారు. చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సెట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ధనుంజయ గారితో నాకిది సెకండ్ ఫిల్మ్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది' అని తెలిపింది.
ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, 'ఈ సినిమా హీరో లుక్ కట్ చేసినప్పుడే మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఫస్ట్ స్టెప్ లోనే సక్సెస్ అయిపోయామనే ఫీలింగ్ కలిగింది. డైరెక్టర్ సుఖేష్ పై నాకు చాలా నమ్మకం ఉంది. చాలా ప్యాషన్ తో ఈ సినిమాను తీశారు. హలగలి చరిత్రలో ఒక అధ్యాయం. బ్రిటిష్ కి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం చిరస్మరణీయం. కన్నడలో పదో తరగతి పాఠ్యాంశంలో కూడా ఇది ఉంది. దీని గురించి చాలామంది రీసెర్చ్ చేశారు. వాటి గురించి తెలుసుకుంటే రోమాంచితులమౌతాం. ఇది ఒక పార్ట్ లో చెప్పాల్సింది కాదు. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం. ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు' అని అన్నారు. దర్శకుడు సుఖేష్ మాట్లాడుతూ, ఇప్పటికీ సినిమా నలభై శాతం పూర్తయ్యిందని, ఈ సినిమా ఆడియెన్స్ కు గొప్ప థ్రియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని తెలిపారు.
Also Read: Shalini Pandey: ఇడ్లీ కొట్లో... ధనుష్ చెల్లిగా...
Also Read: Pragathi: అది ఈ నొప్పులు, బాధల కన్నా గొప్పది