Uprendra: నా ఫోన్ హ్యాక్ అయింది.. కాల్స్ వస్తే స్పందించకండి..
ABN, Publish Date - Sep 15 , 2025 | 04:56 PM
సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కేటుగాళ్లు ముంచేస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర దంపతులకు ఇదే పరిస్థితి ఎదురైంది
సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కేటుగాళ్లు ముంచేస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర (Uprendra) దంపతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తన భార్య ప్రియాంక (Priyanka) ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని, కొన్ని హ్యాష్‌ట్యాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని సదరు వ్యక్తి చెప్పాడని ఆ తర్వాత ఫోన్ హ్యాక్ (Phone Hack) అయిందని ఉపేంద్ర చెప్పారు.
ఆ తర్వాత తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని అన్నారు. డబ్బు డిమాండ్ చేస్తూ ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మెసేజ్‌లు వస్తే రెస్పాండ్ అవ్వవద్దని ఆయన పేర్కొన్నారు. స్పందించొద్దన్నారు. తమ నంబర్ల నుంచి ఎవరైనా ఫోన్ చేసి మనీ అడిగితే పంపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సైబర్ నేరాల నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఉపేంద్ర ఓ వీడియో పోస్టు చేశారు.
ALSO READ: Srimani: సీతారామశాస్త్రి ప్రశంస మరువలేను...
Dhanush: 'ఇడ్లీ కొట్టు' నుంచి మాంచి మెలోడీ సాంగ్ వచ్చేసింది
Meena Sagar: భర్త చనిపోయిన వారానికే రెండో పెళ్లి.. మీనా ఏం చెప్పిందంటే
Bigg Boss Season 9: ఇలా అయితే.. 100 రోజులు నడిపేదెలా