KL Rahul: ‘కాంతార 2’కు క్రికెటర్ ప్రశంసలు..
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:01 PM
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’పై (Kantara chapter 1) వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ (Kl Rahul) ప్రసంశలు కురిపించారు.
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’పై (Kantara chapter 1) వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ (Kl Rahul) ప్రసంశలు కురిపించారు. ఈ సినిమాకు ఆయన ఫిదా అయిన ఆయన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. ‘కాంతార చాప్టర్ 1 చూశాను. మరోసారి రిషబ్ తన ప్రతిభతో మ్యాజిక్ చేశారు. మంగుళూరు ప్రజల నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు’ అని కేఎల్ రాహుల్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు కాంతార టీమ్ కూడా స్పందించింది. మీ పోస్ట్ మాకెంతో గర్వకారణమని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇది మా టీమ్ అందరికీ రియల్ విన్నింగ్ మూమెంట్ అని పేర్కొని. కేఎల్ రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల ఓ వేడుకలో తనకు తనకు ‘కాంతార’ సినిమా అంటే ఎంతో ఇష్టమని కేఎల్ రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై డిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన తర్వాత రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై కేఎల్ స్పందిస్తూ.. ‘‘మ్యాచ్ గెలిచాక సెలబ్రేషన్స్ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటైన ‘కాంతార’ స్ఫూర్తితో చేశాను. నేను ఇక్కడ ఆడుతూ పెరిగాను అని చెప్పడం నా సెలబ్రేషన్స్ ఉద్దేశం’ అని ఆయన అన్నారు.
ALSO READ: Kamal - Rajani: కమల్ - రజనీ మల్టీస్టారర్ దర్శకుడు క్లారిటీ..
Anikha Surendran: అజిత్ రీల్ కూతురు.. దేవుడా ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటి
Venkatesh: శతదినోత్సవం చూసిన 'జయం మనదేరా'
Srikantha Addala: కిరణ్ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...