Coolie: దాన్ని దాటాకపోతే తమిళ్ లో కూడా కూలీ ప్లాపే

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:45 PM

ఇప్పటివరకు పరాజయాన్ని ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj).

Coolie

Coolie: ఇప్పటివరకు పరాజయాన్ని ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj). ఖైదీ సినిమాతో తెలుగువారిని కూడా తనకు ఫ్యాన్స్ గా మార్చుకున్న లోకేష్ ఆ తరువాత విక్రమ్, లియో సినిమాలతో మరింత దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమాలతో లోకేష్ నుంచి సినిమా వస్తుంది అంటే తమిళ్ వారి కంటే తెలుగువారే ఎక్కువ అంచనాలను పెట్టుకుంటున్నారు. అలాగే కూలీ (Coolie) మీద కూడా తెలుగు ప్రేక్షకులే ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.


రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకుంది. తెలుగులో మిక్స్డ్ టాక్ అందుకుంది అంటే అది తెలుగువారికి నచ్చలేదు అని అర్ధం. కూలీలో అంత కథ లేదు అని, లోకేష్ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా నాగ్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉందని, ఆయన కంటే సౌబిన్ షాహిర్ పాత్రనే క్రూరంగా చూపించారని చెప్పుకొచ్చారు. ఇక కలక్షన్స్ విషయంలో కూడా ఇక్కడ అనుకున్నంత రాలేదు.


అయితే తమిళ్ లో మాత్రం కూలీ మంచి టాక్ తోనే కొనసాగుతుంది. రజినీ అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా సైమన్ పాత్రకు వారు కనెక్ట్ అయిన విధానం వేరే లెవెల్. ఎక్కడ చూసిన సైమన్ స్టైల్ లోనే రీల్స్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటివరకు కూలీ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 470 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని సమాచారం. అయితే తమిళ్ లో కూలీ హిట్ అని చెప్పుకోవడానికి ఇది సరిపోదు. మొదట కూలీ అనుకున్న టార్గెట్ రూ. 650 కోట్లు. అంటే ఇంకా రూ. 200 కోట్లు రాబడితే తప్ప కూలీని తమిళ్ లో హిట్ అని చెప్పలేరు.


ఇప్పటికీ కూలీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. తెలుగు విషయం పక్కన పెడితే.. తమిళ్ లో ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏమి రిలీజ్ కు సిద్ధంగా లేవు. శివకార్తికేయన్ మదరాశి రావడానికి ఇంకా పదిరోజులు సమయం ఉంది. ఈలోపు కూలీ అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేస్తుందా.. లేదా అనేది అనుమానమే. అయితే ఆ టార్గెట్ ను ఫినిష్ చేయడానికి మేకర్స్ అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సెన్సార్ A సర్టిఫికెట్ ఇవ్వడంతో ఫ్యామిలీస్.. చిన్న పిల్లలను ఈ సినిమాకు తీసుకెళ్లడం లేదు.


వైలెన్స్ ఎక్కువ ఉందని ఆడవారు కూడా థియేటర్స్ కు రావడం లేదని టాక్. అందుకే సన్ పిక్చర్స్.. తమ సినిమా ఏ విధంగా A సర్టిఫికెట్ ఇచ్చారో చెప్పాల్సిందిగా సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఆ తీర్పు వచ్చాక సినిమాలో కొన్ని అదనపు సీన్స్ ను యాడ్ చేసి మరోసారి కూలీ ప్రమోషన్స్ చేసి మరింత హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక వర్క్ అవుట్ అయితే బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి ఈ మరమత్తులు వలన కూలీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Indian Music Industry: మూడు రెట్ల వృద్థి సాధ్యమే: విక్రమ్ మెహ్రా

Aarti Ravi: తిరుమలలో రవి, కెనీషా.. ఆర్తి సెటైర్స్‌

Updated Date - Aug 26 , 2025 | 03:52 PM