Indian Music Industry: మూడు రెట్ల వృద్థి సాధ్యమే: విక్రమ్ మెహ్రా
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:57 PM
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ళలో పారదర్శకతను నిర్దారించే నియామాలను ప్రవేశ పెట్టడం ద్వారా కాపీరైట్ హోల్డర్ల హక్కులు పరిరక్షించబడతాయని ఐ.ఎం.ఐ. ఛైర్మన్ విక్రమ్ మెహ్రా అభిప్రాయపడ్డారు.
కంటెంట్ క్రియేషన్ లో ఎ.ఐ. (AI) ప్రభావం విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుతం తరుణంలో కాపీరైట్ హోల్డర్ల హక్కులి కాపాడటంతో ప్రభుత్వం ముందుకు రావాలని ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ (IMI) ఛైర్మన్ విక్రమ్ మెహ్రా (Vikram Mehra) కోరారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ళలో పారదర్శకతను నిర్దారించే నియామాలను ప్రవేశ పెట్టడం ద్వారా కాపీరైట్ హోల్డర్ల హక్కులు పరిరక్షించబడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఆల్ అబౌట్ మ్యూజిక్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'ప్రస్తుతం రూ. 3,500 కోట్ల విలువైన ఈ పరిశ్రమ తగిన చర్యలు తీసుకుంటే పదివేల కోట్ల రూపాయలను సాధించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి 'సేఫ్ హార్బర్' రక్షణల వంటి చట్టపరమైన లొసుగులను ఉపయోగించుకునే పెద్ద ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్స్, ముఖ్యంగా షార్ట్ ఫారమ్ వీడియో యాప్‌ల గురించి విక్రమ్ మెహ్రా హెచ్చరించారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు సంగీత పరిశ్రమలోని వివిధ వర్గాలు ఒక్కచోట చేరాయని మెహ్రా తెలిపారు.
ఆన్-గ్రౌండ్ పబ్లిక్ ప్రదర్శనల కోసం లైసెన్సింగ్‌ను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన రాబోయే డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను మెహ్రా ప్రకటించారు. ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు వివిధ సరఫరాదారుల నుండి ఒకే లైసెన్స్‌ను అందించడం ద్వారా ప్రక్రియను సులభతరం చేస్తుందని, తద్వారా వ్యాపార సౌలభ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.
Also Read: Aarti Ravi: తిరుమలలో రవి, కెనీషా.. ఆర్తి సెటైర్స్
Also Read: Mirai: ఇక ఆట మొదలు.. మిరాయ్ క్రేజీ అప్డేట్స్ వచ్చేశాయ్