Aarti Ravi: తిరుమలలో రవి, కెనీషా.. ఆర్తి సెటైర్స్
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:06 PM
జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తితో (Aarti ravi) విడాకులు తీసుకుంటునట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తితో (Aarti ravi) విడాకులు తీసుకుంటునట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు కేసు కోర్టులో ఉండగానే రవి తన స్నేహితురాలు, సింగర్ కెనీషాతో సన్నిహితంగా ఉంటున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా ఫంక్షన్స్‌లో వీరిద్దరూ కలిసి కనిపించారు. తాజాగా కెనీషాతో (Kenisha) కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రవి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతుండటంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: Mirai: ఇక ఆట మొదలు.. మిరాయ్ క్రేజీ అప్డేట్స్ వచ్చేశాయ్
ఈ ఇష్యూపై ఆర్తి ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ‘నువ్వు ఇతరులను మోసం చేయగలవు. నిన్ను నువ్వు మోసం చేసుకోగలవు. కానీ పైనున్న ఆ భగవంతుడిని మోసం చేయలేవు’ అని స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తన భర్త రవిని ఉద్దేశించే అని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఇటీవల తమ బిడ్డల్ని ఉద్దేశించి కూడా ఆమె ఓ నోట్ షేర్ చేశారు. ‘ఉత్తమ తల్లిదండ్రులంటే వారు ఎప్పుడు పిల్లల కోసమే ఆలోచిస్తారు. ఎందుకంటే అమాయకులైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుకోండి’ అని పేర్కొన్నారు.
ALSO READ: Mass Jathara Postponed: అఫీషియల్ గా ప్రకటించిన నిర్మాణ సంస్థ
Vishnu Priya: మరోసారి.. విష్ణు ప్రియ అందాల తాండవం