Balakrishna: 'అఖండ-2' సెప్టెంబర్ 25న వస్తుందా... రాదా...

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:56 PM

నటసింహ బాలకృష్ణ రాబోయే చిత్రం 'అఖండ-2'పై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బాలయ్య సెప్టెంబర్ సెంటిమెంట్ ను తలచుకుని ఫ్యాన్స్ సంబరపడిపోయారు. కానీ, ఇప్పుడు ఆ డేట్ కు 'అఖండ-2' రాబోదని విశేషంగా వినిపిస్తోంది. ఎందుకలాగా!?

Akhanda -2

బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతోన్న నాల్గవ చిత్రం 'అఖండ-2 - తాండవం' (Akhanda -2: Thandavam) ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా గ్రాఫిక్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో అనుకున్న సమయానికి 'అఖండ-2' ఆగమనం అనుమానాస్పందంగానే ఉందని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు బోయపాటి శ్రీను. పైగా 'అఖండ-2' సినిమా ఘనవిజయం ఆయనకు ఎంతో అవసరం. ఎందుకంటే బాలయ్యతో ఇప్పటికే 'హ్యాట్రిక్' సాధించిన బోయపాటి ఈ నాల్గవ చిత్రంతోనూ ఘనవిజయం సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. అంతేకాదు, బాలయ్య తరువాత యంగ్ హీరోస్ తో బోయపాటి తెరకెక్కించిన చిత్రాలేవీ బంపర్ హిట్స్ గా నిలవలేదు.ఈ నేపథ్యంలో 'అఖండ-2'తో భారీ విజయం సాధించాలనే బోయపాటి యోచిస్తున్నారు. అందుకోసం 'అఖండ-2'లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను ఎంతో శ్రద్ధగా రూపొందించారు. వాటిని జీఎఫెక్స్ లో మిక్స్ చేసే క్రమంలో హడావుడి లేకుండా నీట్ గా తెరకెక్కించే పనిలో ఉన్నారు బోయపాటి. ఈ నేపథ్యంలోనే యాక్షన్ ఎపిసోడ్స్ పై బోయపాటి ప్రత్యేక దృష్టిని సారించారు. అవి పూర్తి కావడానికి మరో నెలన్నర సమయం పడుతుందని, అందువల్ల అనుకున్న సమయానికి 'అఖండ-2' రాలేదని సమాచారం.


బాలయ్య.... సెప్టెంబర్...

బాలకృష్ణకు సెప్టెంబర్ మాసం భలేగా కలసి వస్తుందని అభిమానుల మాట. ఆయన కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ గా నిలచిన 'మంగమ్మగారి మనవడు' 1984 సెప్టెంబర్ 7న విడుదలయింది.'కలియుగకృష్ణుడు, బొబ్బిలి సింహం' వంటి హిట్ మూవీస్ కూడా అదే నెలలోనే సందడి చేశాయి. ఇక బాలయ్య కెరీర్ లోనే అద్భుతం అని ఫ్యాన్స్ భావించే రోజు సెప్టెంబర్ 3వ తేదీ. ఎందుకంటే 1993 సెప్టెంబర్ 3వ తేదీన బాలయ్య హీరోగా రూపొందిన 'నిప్పురవ్వ', 'బంగారుబుల్లోడు' రెండూ విడుదలయ్యాయి. రెండు చిత్రాలూ శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలా బాలయ్య కెరీర్ లోని పలు విశేషాలకు నెలవైన సెప్టెంబర్ మాసంలోనే ఆయన తొలిసారి నటించిన పాన్ ఇండియా మూవీ 'అఖండ-2- తాండవం' కూడా వస్తే తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, ఇప్పుడు సెప్టెంబర్ 25న 'అఖండ-2' ఆగమనం అనుమానమే అని వినిపించడం చర్చనీయాంశమయింది.


ప్రస్తుతానికి 'అఖండ-2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా సాగుతోంది. ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కూతురు ఎమ్.తేజస్వినీ నందమూరి సమర్పకురాలు కాగా, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ కోసం యూనిట్ పెట్టుకున్న డెడ్ లైన్ సెప్టెంబర్ 15వ తేదీనే. అది కాగానే వెంటనే సెన్సార్ పూర్తి చేయించి, సెప్టెంబర్ 25న విడుదల చేయాలని మొదటి నుంచీ వేసుకున్న ప్రణాళిక. గ్రాఫిక్స్ వల్ల ఆలస్యం కాకపోతే, తప్పకుండా అనుకున్న తేదీకి వచ్చేవారేనని, అయితే ఆలస్యం అనివార్యంగా కనిపిస్తోందని ఇన్ సైడ్ టాక్. అదే సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ 'ఓజీ' కూడా విడుదల కానుందని తెలుస్తోంది. దసరా సీజన్ కాబట్టి స్టార్ హీరోస్ సినిమాలు పోటీ పడడం కొత్తేమీ కాదు. అందువల్ల అదేమీ పెద్ద విశేషం కాదు. కానీ 'అఖండ-2' ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 25న వస్తుందా రాదా అన్నదే అనుమానం. మరి ఏమవుతుందో చూడాలి.

Also Read: Brahmanandam: నారాయణమూర్తి పులస చేప లాంటోడు...

Also Read: Nandamuri Padmaja: ఎన్టీఆర్ పెద్ద కోడలు మృతి...

Updated Date - Aug 19 , 2025 | 01:56 PM

Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం

Akhanda 2 : బాలయ్య సరసన సంయుక్త

Akhanda 2 Thandavam: ‘అఖండ 2: తాండవం’‌కి విలన్‌గా ‘సరైనోడు’ పడ్డాడులే..

Akhanda 2: అఖండ 2లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్ .. పోస్టర్ అదిరింది

Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?